
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి నిధులిచ్చిందని కేంద్ర ఆర్థిక మంత్రి లోక్‌సభలో చేసిన ప్రకటన హాస్యాస్పదంగా ఉందని రాష్ట్ర మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం కేంద్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో అధిక ఆదాయమిచ్చిందన్న విషయాన్ని రాష్ట్ర ప్రజలతో పాటు దేశ ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరముందని బుధవారం ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు.
గత ఐదేళ్లలో రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళ్లిన పన్నుల ఆదాయం, రాష్ట్రానికి కేంద్రం కేటాయించిన నిధులకు సంబంధించిన గణాంకాలను ఆ ట్వీట్‌తో జత చేశారు. 2014–19మధ్య కాలంలో రాష్ట్రం.. కేంద్రానికి రూ.2,72,926 కోట్ల పన్నుల ఆదాయం ఇచ్చిందని, కేంద్రం కేవలం రూ.1,12,854 కోట్లను మాత్రమే రాష్ట్రానికి తిరిగి ఇచ్చిందని ఈ గణాంకాలు పేర్కొంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment