
సాక్షి, గుంటూరు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనకు ప్రకృతి కూడా సహకరిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. సాగర్ రిజర్వాయర్ నుంచి బుధవారం కుడికాలువకు నీటిని విడుదల చేశారు. ఈ క్రమంలో 2 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసిన సందర్భంగా రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ... ఎనిమిదేళ్లుగా నిండని సాగర్‌కు ఇప్పుడు నీళ్లు వచ్చాయని హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ప్రకృతి కూడా సహకరిస్తోందని.. రైతులందరికీ ఇకపై అన్నీ మంచిరోజులేనని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment