మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ, న్యూస్‌లైన్: ఖాళీగా ఉన్నాయని ప్రభుత్వ స్థలాలు ఆక్రమించే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఆర్డీఓ హన్మంతరావు హెచ్చరించారు. జిల్లాకేంద్రంలో కబ్జాకు గురైన ప్రభుత్వ స్థలాలను శనివారం సందర్శించారు. ఈ సంద ర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ స్థలాలను కబ్జాలకు పాల్పడే ఎంతటి వారినైనా వదిలేది లేదని, ఈ విషయంలో తాము కఠినంగా వ్యవహరిస్తామన్నారు. విలువైన ప్రభుత్వ స్థలాలు కాపాడేందుకు వాటిని గుర్తించి, కంచె ఏర్పాటు చేసేందుక చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ఇదివరకే ప్రణాళికలు సిద్ధం చేసి, జేసీ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు.
నిధులు రాగానే విలువైన ప్రభుత్వ స్థలాలకు కంచెను ఏర్పాటు చేసి వాటిని కాపాడుతామని ఆర్డీఓ తెలిపారు. పెద్దచెర్వు ప్రాంతంలోని సర్వే నం.25, 67లతో పాటు, లక్ష్మీనగర్‌కాలనీలోని 260, 380 నంబర్లలో కబ్జాకు గురైనా భూములు ఆయన పరిశీలించారు. వెంటనే కబ్జాదారులకు నోటీసులు జారీచేసి వారిపై కఠినచర్యలు తీసుకోవాల్సిందిగా తహశీల్దార్‌ను ఆదేశించారు. ప్రభుత్వ స్థలం ఎక్కడున్నా ఆస్థలంలో ప్రభుత్వ భూమి అనే బోర్డును ఏర్పాటు చేయాల్సిందిగా సూచించారు. ఆయన వెంట తహశీల్దార్ యాదగిరిరెడ్డి,సర్వేయర్ రంగయ్య, గిర్దావర్ చంద్రశేఖర్, వీఆర్వో తాయబ్, తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తే క్రిమినల్ కేసులు
Published Sun, Oct 13 2013 5:33 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement
Advertisement