అనంతపురం జిల్లా గుంతకల్లు మండలంలోని పొట్టిశ్రీరాములు సర్కిల్ వద్ద రైల్వే మంత్రి సురేష్ ప్రభు దిష్టిబొమ్మను సీపీఐ నాయకులు దగ్ధం చేశారు.
అనంతపురం (గుంతకల్లు): గుంతకల్లు రైల్వే డివిజన్‌కు ప్రతి ఏటా రైల్వే బడ్జెట్‌లో తీవ్ర అన్యాయం జరుగుతున్నా కేంద్రాన్ని నిలదీయడం చేతకాని సీమ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేయాలని సీపీఎం డివిజన్ కార్యదర్శి డి.శ్రీనివాసులు డిమాండ్ చేశారు. రైల్వే బడ్జెట్‌లో మరోసారి గుంతకల్లు డివిజన్‌కి మొండిచేయి చూపడాన్ని నిరసిస్తూ సీపీఎం నాయకులు గురువారం సాయంత్రం పొట్టిశ్రీరాములు సర్కిల్‌లో కేంద్ర రైల్వే శాఖా మంత్రి సురేష్‌ప్రభూ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. రైల్వే మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్ మాటల బడ్జెటే తప్ప, దీని వల్ల రాష్ట్రానికి గానీ, గుంతకల్లు డివిజన్‌కు గానీ ఒరిగింది శూన్యమని ఈ సందర్భంగా ఆయన చెప్పారు.నినాదాలు చేశారు.