
తిరుమల శ్రీవారి ఆలయం
తిరుపతి కల్చరల్: తిరుమల శ్రీవారి ఆలయంపై కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. ఆదివారమిక్కడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. టీటీడీలోని ఐఏఎస్ అధికారులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారన్నారు. ఫలితంగానే శ్రీవారి సొమ్ము, ఆస్తులపై పురావస్తు శాఖ కన్నుపడిందని పేర్కొన్నారు.
తిరుమల శ్రీవారి ఆలయానికి సంబంధించి పురావస్తు శాఖ టీటీడీ ఈవోకు లేఖ రాయడం, వెంటనే ఉపసంహరించుకోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. పురావస్తు శాఖ లేఖ రాయడం వెనుక బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ కుట్ర ఉందని ఆరోపించారు. తిరుమల కొండపైన పురాతన కట్టడాలు తొలగించాలన్నా, నిర్మించాలన్నా ఆగమ సలహామండలి సూచనలను టీటీడీ అధికారులు పట్టించుకోకపోవడంతో ఆలయ ప్రతిష్ట దిగజారుతోందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment