
'రుణమాఫీకి ఆర్బీఐ గవర్నర్ ఒప్పుకోలేదు'
విజయవాడ: పంట రుణాల మాఫీకి రిజర్వు బ్యాంకు గవర్నర్ ఒప్పుకోలేదని, కేంద్ర ప్రభుత్వం ముందుకు రాలేదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. 20 శాతం రుణమాఫీ నిధులను ఈ నెల 22న బ్యాంకుల్లో జమ చేస్తామని చెప్పారు. మిలిగిన 80 శాతం నిధులను వచ్చే నాలుగేళ్లలో ఏడాదికి 20 శాతం చొప్పున చెల్లిస్తామని వెల్లడించారు.
నూతన రాజధానికి రైతులు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. భూముల సేకరణ విషయంలో సర్కారుకు సహకారం అందించాలని కోరారు. ఫించన్ల వివరాలను కంప్యూటరీకరిస్తామని చంద్రబాబు చెప్పారు.