ఆర్బీఐ గవర్నర్తో ఫోన్లో మాట్లాడిన బాబు | Chandrababu Naidu talk with RBI Governor due to farmers craft loan | Sakshi
Sakshi News home page

ఆర్బీఐ గవర్నర్తో ఫోన్లో మాట్లాడిన బాబు

Published Wed, Jun 18 2014 12:15 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

ఆర్బీఐ గవర్నర్తో ఫోన్లో మాట్లాడిన బాబు - Sakshi

ఆర్బీఐ గవర్నర్తో ఫోన్లో మాట్లాడిన బాబు

రైతుల రుణమాఫీ తమ వల్ల కాదంటూ ఆర్బీఐ ప్రకటించడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ఇబ్బందుల్లో పడ్డారు. దాంతో బుధవారం ఆర్బీఐ గవర్నర్ రఘురామరాజన్తో చంద్రబాబు ఫోన్లో మాట్లాడారు. రుణమాఫీ అవశ్యకతను ఈ సందర్బంగా రఘురామరాజన్కు చంద్రబాబు వివరించారు. రుణమాఫీ అంశంపై మరింత వివరంగా అటు కేంద్రంతో పాటు ఇటు ఆర్బీఐ గవర్నర్కు లేఖ రాయాలని చంద్రబాబు నిర్ణయించారు.

 

ఇటీవల జరిగి ఎన్నికల హామీలలో భాగంగా రైతులకు రుణమాఫీ చేస్తానని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అంతేకాకుండా సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మొట్టమొదటగా రుణమాఫీ ఫైల్పై సంతకం చేస్తానంటూ హామీ కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో టీడీపీకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒటేశారు. దాంతో చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ప్రమాణ స్వీకార కార్యక్రమంలో అయిన తర్వాత రుణమాఫీపై కమిటీ వేస్తుందుకు ఉద్దేశించిన ఫైల్పై సంతకం చేశారు. అయితే ఆంధ్రప్రదేశ్లో రైతులకు రుణమాఫీ చేయాలంటే రూ. 80 వేల కోట్లకుపైగా అవసరం అవుతాయి. అంత సొమ్ము రుణమాఫీ మా వల్ల కాదంటూ ఆర్బీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement