శ్రీశైల జలాశయానికి ఎగువ పరీవాహకప్రాంతాల నుంచివచ్చే వరదనీటి ప్రవాహం తగ్గింది. దీంతో శనివారం సుమారు 63 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, ఆదివారం సాయంత్రం సమయానికి 13,026 క్యూసెక్కుల వరద నీరు మాత్రమే వస్తోంది.
శ్రీశైల జలాశయానికి ఎగువ పరీవాహకప్రాంతాల నుంచివచ్చే వరదనీటి ప్రవాహం తగ్గింది. దీంతో శనివారం సుమారు 63 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, ఆదివారం సాయంత్రం సమయానికి 13,026 క్యూసెక్కుల వరద నీరు మాత్రమే వస్తోంది. జూరాల నుంచి విడుదల చేస్తున్న కృష్ణా జలాలను మధ్యాహ్నం 1.20 గంటల సమయంలో నిలిపివేశారు. ప్రస్తుతం జలాశయంలో 48.4096 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యాం నీటిమట్టం 828.90 అడుగులకు చేరుకుంది.