పాలమూరు, న్యూస్‌లైన్: ఇకనుంచి రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన సవర ణ, ఒప్పందాల రద్దు తలకు మించిన భారంగా మారనుంది. నేటి నుంచి భూ క్రయవిక్రయాల రిజిస్ట్రేషన్ మరింత చార్జీలు పెరగనున్నాయి. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అందించే వివిధ రకాల సేవలకు సంబంధిం చి పెంచిన ఫీజులు ఆదివారం నుంచి అమల్లోకి రానున్నాయి. రిజిస్ట్రేషన్‌ను సమయానికి చేసుకోలేకపోయి నా, ఆస్తి వివాదం ఉన్నా, సర్టిఫికెట్లలో లోపాలున్నా రి జిస్ట్రేషన్ తర్వాత దాన్ని రద్దు చేసుకునే అవకాశం కూ డా ఉంది.
అయితే ఈ మూడు రకాల ఫీజులను ప్రభుత్వం పదిరెట్లు పెంచేసింది. వీటికి ప్రస్తుతం వందరూపాయలు ఉండగా, రూ.వెయ్యికి పెంచేసింది. అటెస్టేషన్ ఆఫ్ స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ, విక్రయహక్కు లు లేని జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ, విల్ ఎంక్వయిరీ, సీల్డ్ కవర్ డిపాజిట్ ఫీజులను కూడా రూ.వంద నుం చి రూ.వెయ్యికి పెంచింది. సెలవు దినాల్లో రిజిస్ట్రేష న్, భాగస్వామ్య ఒప్పందాల ఫీజును రూ.వెయ్యి నుం చి రూ.ఐదువేలకు పెంచింది. హక్కుదారు కదల్లేని పరిస్థితుల్లో సబ్ రిజిస్ట్రారు కార్యాలయ సిబ్బంది ఇం టికి వచ్చే ప్రైవేట్ అటెండెన్స్‌కు ప్రస్తుతం రూ.ఐదొందల రుసుం కాగా దీన్ని రెట్టింపు చేశారు.
సర్టిఫైడ్ కాపీలు (నకళ్లు) కోసం ప్రస్తుతం రూ.50 చెల్లిస్తుండగా.. ఇకనుంచి రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. భూమి, ఇళ్లు, ఇంటి స్థలం కొనదలచిన వారు తప్పకుండా వాటికి సంబంధించిన ఈసీ, నకళ్లు(సీసీ) తీసుకోవాల్సిందే..30 ఏళ్లలోపు లావాదేవీల వివరాలతో కూడిన ఈసీ కావాలంటే రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. 30 ఏళ్లకు మించిన లావాదేవీల వివరాలు కావాలంటే ఈసీ కోసం రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. టైటిల్ డీడ్‌ల విడుదల ఫీజును మాత్రం రూ.వెయ్యికి తగ్గించింది. హక్కు విడుదల దస్తావేజు ఫీజు రూ.వెయ్యి రూ.10 వేలకు పెరిగినట్లే. అమ్మకం డిక్రీ రుసుముల విలువలో 0.5 శాతం యథాతథంగా ఉంటుంది. తనఖా దస్తావేజు రుసుం ఆస్తి విలువలో 0.5 శాతం నుంచి 0.1 శాతానికి తగ్గింది.
ఏటా రూ.2.50 కోట్ల భారం
జిల్లాలో ఆయా రిజిస్ట్రేషన్ కార్యాలయాల పరిధిలో ఈసీ, సీసీ సేవలు నెలకు నాలుగు వేల చొప్పున.. పెంచిన ఫీజు ప్రకారం ఏటా దాదాపు రూ.50 లక్షల వరకు ప్రజలపై అదనపు భారం పడనుంది. రక్త సంబంధీకులకు దాన సెటిల్‌మెంట్, సెలవుదినాల్లో రిజిస్ట్రేషన్, అభివృద్ధి ఒప్పందం, ఇతర సేవలకు సంబంధించి పెంచిన ఫీజుల ప్రకారం రూ.రెండుకోట్ల వరకు క్రయవిక్రయ దారులపై భారం పడనున్నట్లు అంచనా..
ఇక సెటిల్‌మెంట్ భారం
రక్త సంబంధీకులకు స్థిరాస్తిని దానంగా కట్టబెడుతూ.. సెటిల్ మెంట్ రాయించేందుకు ప్రస్తుతం రూ.వెయ్యి చెల్లిస్తుండగా..స్థిరాస్తి విలువలో 0.5 శాతం కనిష్టంగా రూ.వెయ్యి, గరిష్టంగా రూ.10వేలు చెల్లించాలని నిర్ణయించారు. ఈ ఫీజు రూ.వెయ్యి నుంచి రూ.10 వేలకు పెరిగినట్లేనని సబ్ రిజిస్ట్రార్లు చెబుతున్నారు. స్థలాన్ని అభివృద్ధి చేసేందుకు కుదుర్చుకునే ఒప్పందాల రిజిస్ట్రేషన్‌కు రూ.రెండువేల ఫీజు ఉండగా.. ఆస్తి విలువలో ఫీజు 0.5 శాతం గరిష్టంగా రూ.20వేలుగా నిర్ణయించారు. టైటిల్ డీడ్ డిపాజిట్ ఫీజు ఆస్తి విలువలో 0.1 శాతం గరిష్టంగా రూ.వెయ్యి ఉండగా, ప్రభుత్వం దీన్ని గరిష్టంగా రూ.10 వేలకు పెంచింది.
సవరణ భారమే..
రిజిస్ట్రేషన్ సమయంలో దిక్కులు, ఇంటిపేర్లు, ఉప నంబర్లు వంటి అంశాల్లో ఎక్కడైనా తప్పుగా నమోదైతే తర్వాత సవరించుకునే (రెక్టిఫికేషన్)అవకాశం ఉంది. ఆస్తి వాటాదారుల్లో ఎవరైనా ఒకరు విధిలేని పరిస్థితుల్లో ఫలానా తేదీన వచ్చి సంతకాలు చేస్తామంటూ ఒప్పుదల (రాటిఫికేషన్) ఒప్పందం చేసుకునే వెసులుబాటు కల్పించారు.
‘రిజిస్ట్రేషన్’ బాదుడు
Published Sun, Sep 1 2013 5:51 AM | Last Updated on Fri, Sep 1 2017 10:21 PM
Advertisement
Advertisement