ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖలో చాలా కాలంగా ఔట్ సోర్సింగ్‌లో విధులు నిర్వర్తిస్తున్న వారందరికి రెగ్యులరైజ్ చేయ్యాలని..
గుంటూరు : ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖలో చాలా కాలంగా ఔట్ సోర్సింగ్‌లో విధులు నిర్వర్తిస్తున్న వారందరికి రెగ్యులరైజ్ చేయ్యాలని కోరుతూ శాఖ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎ.వి.భాస్కరరావు, జిల్లా నాయకులు వై.బాలకృష్ణలు ఆ శాఖ కమీషనర్ ఐ.శ్రీనివాసకు వినతి పత్రం అందజేశారు. స్దానిక బ్రాడిపేటలోని ప్రొహిబిషన్ అండ్ ఎకై్సజ్ శాఖ రాష్ట్ర కమీషనర్ ఐ.శ్రీనివాస విచ్చేసిన సంధర్బంగా శాఖ రాష్ట్ర ఔట్ సోర్సింగ్ అధ్యక్షులు, జిల్లా నాయకులు గౌరవ పుర్వకంగా కలిసి పుష్పగుఛ్చం అందజేసి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్బంగా శాఖ రాష్ట్ర ఔట్‌సోర్సింగ్ అధ్యక్షులు ఎ.వి.భాస్కరరావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఔట్‌సోర్సింగ్‌లో 76 మంది విధులు నిర్వర్తిస్తున్న వారందరికి రెగ్యులైజ్ కాని కాంట్రాక్ట్ కింద మంజూరు చేయ్యాల్సిందిగా కోరారు. అలాగే ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి ట్రజరీ ద్వారా జీత భత్యాలు అందేలా చర్యలు తీసకోవాలని ఎజెన్సీల పద్ధతిని రద్దు చేయ్యాలని కోరారు. అదే విధంగా చాలా కాలంగా శాఖలో విధులు నిర్వర్తిస్తున్న వారందరికి కూడా జీత్చాలు పెంచే ప్రక్రియ పై దృష్టి సారించాల్సిందిగా కోరుతూ వినతి పత్రం అందజేశారు. స్పందిచిన కమీషనర్ శ్రీనివాస ఔట్ సోర్సింగ్ సిబ్బంది పై ఇచ్చిన వినతి పత్రం పై పరిశీలించి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.