కలెక్టర్ తీరుపై రెవెన్యూ అధికారులు తిరుగుబావుటా ఎగురవేశారు. ఆయన తీరుకు నిరసనగా సోమవారం జిల్లా వ్యాప్తంగా నల్లబ్యాడ్జీలు ధరించి ఆందోళనకు శ్రీకారం చుట్టారు. మంగళవారం అన్ని మండల కేంద్రాల నుంచి భారీ సంఖ్యలో రెవెన్యూ అధికారులు తరలివెళ్లి కలెక్టరేట్ ముట్టడికి సన్నద్ధమయ్యారు. వీరిని నయానో భయానో ఆందోళన విరమించేలా ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి.
సాక్షి ప్రతినిధి, తిరుపతి: కలెక్టర్‌తీరుపై రెవెన్యూ అధికారులు భగ్గుమన్నారు. ఆయన తీరుకు నిరసనగా సోమవారం జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. మంగళవారం కలెక్టరేట్ ముట్టడికి సన్నద్ధమయ్యారు.
అవమాన పరిచారు..
ప్రతిఏటా ప్రతిభచూపిన ఉద్యోగులకు మంత్రి చేతు ల మీదుగా సత్కరించి అవార్డులు ఇవ్వడం ఆనవాయితీ. అయితే ఈ ఏడాది రెవెన్యూ ఉద్యోగులకు కలెక్టర్ మొండిచేయి చూపారు. అవార్డులు ఇస్తామని జిల్లా కేంద్రానికి పిలిపించి అవమానపరిచారు. ఇది రెవెన్యూ ఉద్యోగులను తీవ్ర మనోవేదనకు గురిచేసింది. రెవెన్యూ శాఖకు సంబంధించిన ఉద్యోగ సం ఘాలు చిత్తూరులో సమావేశమై ఆయన తీరును నిరసిస్తూ ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని నిర్ణయించారు.
ఉద్యమ కార్యాచరణ ఇలా..
జిల్లా వ్యాప్తంగా ఉన్న రెవెన్యూ ఉద్యోగులు మంగళవారం సామూహిక సెలవు పెట్టి చలో చిత్తూరు, కలెక్టరేట్ ముట్టడికి సన్నద్ధమయ్యారు. 3వేల మంది ఉద్యోగులతో ముట్టడి చేపట్టాలని తీర్మానించారు. గ్రామసభలు వాయిదా వేయాలని నిర్ణయించారు. గ్రామస్థాయిలో వీఆర్‌ఏ నుంచి తహశీల్దార్ వరకు 65 బస్సుల్లో చిత్తూరు చేరుకునేలా ప్రణాళిక రచిం చారు. మంగళవారం జిల్లాలో సీఎం పర్యటన కార్యక్రమాలను,సైతం బహిష్కరించాలని నిర్ణయించారు.
బెదిరింపులు.. బేరసారాలు
రెవెన్యూ ఉన్నతస్థాయి ఉద్యోగి ఇప్పటికే 66 మంది తహశీల్దార్లతో బేరసారాలకు దిగినట్లు తెల్సింది. కలెక్టరేట్ ముట్టడిని విరమించి ఉద్యోగులు విధుల్లో పాల్గొనాలని సూచిస్తున్నట్లు తెలుస్తోంది. సీఎం పర్యటనకు హాజరు కావాలని తమతో చర్చించేందుకు పాలనాధికారి సిద్ధంగా ఉన్నారంటూ ఉద్యోగ సంఘాల నాయకులపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. దీంతో పాటు మధ్యవర్తుల ద్వారా వ్యక్తిగతంగా బెదిరింపులు ప్రారంభమయినట్లు ఉద్యోగులు చెబుతున్నారు. మాట వినకపోతే ఏసీబీ అధికారులతో దాడులు చేయిస్తామని హెచ్చరికలు చేసినట్లు సమాచారం. ప్రభుత్వానికి చెడ్డపేరువస్తే వదిలేప్రసక్తే లేదని కొంతమంది అధికారుల ద్వారా ఉద్యోగులను దారిలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. సంఘాలను విడగొట్టే ప్రయత్నాలూ ప్రారంభమయ్యాయి.
రెవెన్యూ వేదన
‘కలెక్టర్ తీరుతో 16 నెలలుగా ఎంతో మానసిక వేదన అనుభవించాం. కష్టాలు..నష్టాలకోర్చాం. అవమానాలు భరించాం.. ఇక ఉపేక్షించేదిలేదు.. ఎన్ని ఒత్తిడిలు వచ్చినా వెనక్కి తగ్గేది లేదు.. ’ అంటూ రెవెన్యూ అధికారులు తమ ఆవేదనను వెళ్లగక్కారు.
దళిత ఉద్యోగులే ఆయనకు టార్గెట్
ఓ దళిత ఉన్నత రెవెన్యూ అధికారితో పాటు మరో ఉన్నతాధికారి నిత్యం
మానసిక క్షోభకు గురయ్యేలా వేధింపులు
ఓ సీనియర్ అసిస్టెంట్‌ను జూనియర్ అసిస్టెంట్‌గా డీమోట్ చేసిన వైనం.
పనివేళలతో సంబంధం లేకుండా వీడియో, సెట్, మొబైల్ కాన్ఫరెన్స్‌లు..
శని, ఆదివారాల్లో సమీక్షలు సమావేశాలు..
సాయంత్రం 5 గంటలకు సెట్‌కాన్ఫరెన్స్ అంటే రాత్రి 10 గంటలకు
{పారంభమవుతున్న తీరు. అవమానం
స్వాతంత్య్ర దినోత్సవం రోజు రెవెన్యూ ఉద్యోగులకు అవార్డులు ఇస్తామంటూ చిత్తూరుకు పిలిపించి అవమానించి వెనక్కు పంపారు.
సమావేశాల్లో తరచూ ‘రెవెన్యూ
ఉద్యోగులు దొంగలంటూ వ్యాఖ్యలు’
రెవెన్యూ ఉద్యోగుల పోరుబాట
Published Tue, Aug 18 2015 2:53 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
Advertisement
Advertisement