నేడు జిల్లాకు సీఎం రాక | Today, the arrival of the chief of the district | Sakshi
Sakshi News home page

నేడు జిల్లాకు సీఎం రాక

Published Thu, Aug 27 2015 1:46 AM | Last Updated on Thu, Mar 21 2019 8:19 PM

నేడు జిల్లాకు  సీఎం రాక - Sakshi

నేడు జిల్లాకు సీఎం రాక

చిత్తూరు(గిరింపేట)/తిరుపతి క్రైం : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం తిరుపతికి రానున్నట్లు కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. 27న సాయంత్రం 5.30 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి 6.10 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు.

అక్కడి నుంచి పీఎల్‌ఆర్ గార్డెన్స్‌లో జరిగే సత్యవేడు ఎమ్మెల్యే తలారి ఆదిత్య వివాహ వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం రాత్రి 7.45 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని, అక్కడి నుంచి హైదరాబాద్‌కు వెళ్తారని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా రానున్న సందర్భంగా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement