గోదావరి, కృష్ణా నదుల అనుసంధానంపై సమీక్ష
హైదరాబాద్: నదుల అనుసంధానంపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. గోదావరి, కృష్ణా నదుల అనుసంధానానికి చర్యలు చేపట్టాలని అధికారులకు చంద్రబాబు సూచించారు. గోదావరి వరద జలాల వినియోగానికి రూ.1272 కోట్లు నిధులు అవసరమవుతాయని ముఖ్యమంత్రికి అధికారులు తెలిపారు.
గోదావరి, కృష్ణా నదుల అనుసంధానంతో రాయలసీమకు మరింత లబ్ది కలుగుతుందని చెప్పారు. పెండింగ్ లో వంశధార, తోటపల్లి, వెలుగొండ ప్రాజెక్టులు పూర్తి చేయాలని చంద్రబాబు ఆదేశించారు. పోలవరం ప్రధాన కాల్వ పనులు వచ్చే రబీ నాటికి పూర్తి చేయాలన్నారు.