ఆగి ఉన్న పైపుల లారీని టిప్పర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరొకరికి గాయాలయ్యాయి.
ఇబ్రహీంపట్నం (కృష్ణా): ఆగి ఉన్న పైపుల లారీని టిప్పర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరొకరికి గాయాలయ్యాయి. ఈ సంఘటన కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి వద్ద ఆదివారం తెల్లవారుజామున జరిగింది. వివరాలు.. ఆదివారం తెల్లవారుజామున రోడ్డు మీద ఆగి ఉన్న పైపుల లారీని వెనుక నుంచి టిప్పర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో పైపులు టిప్పర్లోకి దూసుకెళ్లాయి.
దీంతో టిప్పర్లో ఉన్న డ్రైవర్, మరో ఇద్దరు ప్రయాణికులు ఇరుక్కుపోయారు. డ్రైవర్ మేకల సురేష్కు గాయాలయ్యాయి. అందులో ప్రయాణిస్తున్న ఒడిశాకు చెందని 21 ఏళ్ల యువకుడు మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను రక్షించేందుకు గ్యాస్‌కట్టర్‌లను తెప్పించారు.