సమైక్యాంధ్ర ఉద్యమంలో మేముసైతం అంటూ ఆర్టీసీ ఉద్యోగులు నిరవధిక సమ్మె చేయడంతో జిల్లాలో ఆర్టీసీ సుమారు రూ.19 కోట్ల ఆదాయం కోల్పోయింది.
రూ.19 కోట్ల ఆదాయం కోల్పోయిన ఆర్టీసీ
Published Mon, Sep 23 2013 1:13 AM | Last Updated on Fri, Sep 1 2017 10:57 PM
ఏలూరు(ఆర్‌ఆర్ పేట) న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర ఉద్యమంలో మేముసైతం అంటూ ఆర్టీసీ ఉద్యోగులు నిరవధిక సమ్మె చేయడంతో జిల్లాలో ఆర్టీసీ సుమారు రూ.19 కోట్ల ఆదాయం కోల్పోయింది. పశ్చిమ రీజియన్ పరిధిలోని ఏలూరు, జంగారెడ్డిగూడెం, తాడేపల్లిగూడెం, నరసాపురం, తణుకు, భీమవరం డిపోల పరిధిలో రోజూ 640 బస్సులు ప్రయాణికులను గమ్య స్థానాలకు చేర్చేవి. సాధారణ రోజుల్లో రోజుకు సుమారు రూ.45 లక్షల ఆదాయం వచ్చేది.
సమ్మె ప్రభావంతో జిల్లాలో ఆర్టీసీ బస్సులు పూర్తిగా నిలిచిపోయాయి. ఆర్టీసీ కార్మిక సంఘాలైన ఎంప్లాయూస్ యూనియన్, నేషనల్ మజ్దూర్ యూనియన్, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ తదితర అన్ని యూనియన్లు సమ్మెలో ఉన్నాయి. ఆర్టీసీ కార్మికులు సమ్మె ప్రారంభించి ఆదివారం నాటికి 41 రోజులైంది. రోజుకి సుమారు రూ.45లక్షలు చొప్పున రూ.18.50 కోట్లకుతోడు రాష్ట్ర విభజన ప్రకటన వెలువడిన వెంటనే ఈ ఏడాది జులై 30న జిల్లా బంద్ కారణంగా పూర్తిగా బస్సులు నిలిచిపోయాయి. దీంతో సుమారు రూ. 19 కోట్ల ఆదాయాన్ని ఆర్టీసీ పశ్చిమ రీజియన్ కోల్పోయింది.
Advertisement
Advertisement