సాక్షి, హైదరాబాద్: బస్సు రిజర్వేషన్ టికెట్‌ను ఒకసారి పోస్ట్‌పోన్ లేదా ప్రిపోన్ చేసుకుంటే ఆ తర్వాత క్యాన్సిల్ చేసుకోవడానికి ఆర్టీసీ అవకాశం కల్పించడం లేదు. ప్రయాణ తేదీని ఒకసారి మార్చుకోవడానికి అవకాశం కల్పిస్తున్న ఆర్టీసీ.. ఆ తర్వాత టికెట్ క్యాన్సిల్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం లేదు. దీంతో ప్రయాణికులు టికెట్ మొత్తాన్ని వదులుకోవాల్సి వస్తోంది. రైల్వేలో రిజర్వేషన్ చార్జీ మినహాయించుకొని టికెట్ సొమ్మును వాపసు ఇస్తుండగా.. ఎయిర్‌లైన్స్ సంస్థలు కూడా కొంత మొత్తాన్ని తిరిగి చెల్లిస్తున్నాయి. ఆర్టీసీ మాత్రం టికెట్ రద్దు చేసుకోవడానికి అవకాశం కల్పించకపోవడంపై ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
కొత్త బస్సుల కొనుగోలు కోసం రూ. 25 కోట్లు
కొత్త బస్సులు కొనేందుకు బడ్జెట్ నిధుల్లోంచి రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి రూ. 25 కోట్లు విడుదల చేసింది. ఆర్టీసీకి కేటాయించిన రూ. 100 కోట్ల నుంచి ఈ మొత్తాన్ని విడుదల చేసేందుకు పరిపాలన అనుమతులిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రయాణికుల సొమ్ము ఆర్టీసీ పాలు
Published Thu, Feb 6 2014 5:51 AM | Last Updated on Sat, Sep 2 2017 3:24 AM
Advertisement
Advertisement