
దేవుడా..!
ఆలయ పాలక మండళ్లలో పదవుల కోసం అధికార పార్టీ నేతల్లో పోటీ పెరిగింది. ఎవరికి వారు తమకు పదవి ఇవ్వాలంటే తమకు ఇవ్వాలని పెద్దస్థాయి
కాకినాడ రూరల్ :ఆలయ పాలక మండళ్లలో పదవుల కోసం అధికార పార్టీ నేతల్లో పోటీ పెరిగింది. ఎవరికి వారు తమకు పదవి ఇవ్వాలంటే తమకు ఇవ్వాలని పెద్దస్థాయి నేతల వద్దకు ప్రదక్షిణలు చేస్తున్నారు. పైరవీలూ ప్రారంభించారు. పదేళ్లపాటు అధికారంలో లేకపోయినా పార్టీకి సేవలందించామని, తమకు ఎలాగైనా నామినేటెడ్ పదవి కట్టబెట్టాలని నాయకుల వద్ద మంత్రాంగాలు సాగిస్తున్నారు. అయితే వీరి ఆశలపై దేవాదాయశాఖ రూపొందించిన కొన్ని మార్గదర్శకాలు నీళ్లుచల్లుతున్నాయి. అయినా ఆ నిబంధనలను పక్కనపెట్టి తమకు పదవి ఇవ్వాలని ద్వితీయశ్రేణి నేతలు వేడుకుంటున్నారు.
గతంలో పలు ఆలయాలకు నియమితులైన పాలక మండలి సభ్యులు, చైర్మన్లు అభివృద్ధిపై దృష్టిపెట్టకుండా సొంత కార్యక్రమాలకు ప్రాధాన్యమిచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి. కొన్నిచోట్ల ఈఓలు, పాలకమండళ్ల మధ్య వివాదాలు జరిగాయి. కొన్నిచోట్ల నిధుల స్వాహా జరిగింది. దీంతో దేవాదాయ శాఖ మేల్కొని పాలకమండళ్ల నియామకంపై కొన్ని మార్గదర్శకాలు రూపొందించింది. ఆలయాల ఆదాయాన్ని బట్టి వాటిని వివిధ విభాగా కింద విభజించింది. రూ. 25 లక్షల ఆదాయంపైన ఉన్న ఆలయాలను 6ఏగా, రూ.2 లక్షలపైగా ఆదాయం ఉండి రూ.25 లక్షల లోపు ఆదాయం ఉంటే 6బీగా, రూ.2లక్షల లోపు ఆదాయం ఉంటే 6సీగా, మఠాలను 6డీగా పరిగణించి మార్గదర్శకాలను రూపొందించింది.
నియామకం ఇలా..
విభాగంలోని ఆలయాలకు పాలక మండళ్లను దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్ నియమిస్తారు. విభాగంలోని ఆలయాలకు ప్రభుత్వమే పాలక మండళ్లను ఏర్పాటు చేస్తుంది.
విభాగంలోని ఆలయాలకు పాలక మండళ్లను దేవాదాయ శాఖ కమిషనర్
నియమించాల్సి ఉంటుంది.
పాటించాల్సిన మార్గదర్శకాలు
పాలక మండళ్లలో సభ్యులకు నిర్దిష్ట అర్హతలు ఉండాలి
మద్యపానం అలవాటు లేనివారై ఉండాలి
పోలీసు కేసులు ఉండకూడదు.
అంటువ్యాధులు ఉండకూడదు.
నేరప్రవృత్తి ఉండకూడదు.
దేవాదాయ భూములు లీజుకు తీసుకుని బకాయిలు చెల్లించకుండా ఉన్న వారు అనర్హులు.
గతంలో విరాళాలు సేకరించి
నిధులు స్వాహా చేసిన వారు అనర్హులు.
నియమితులైన తర్వాత పాటించాల్సిన నిబంధనలు
దాతలు ఇచ్చే విరాళలు ఆలయ కార్యనిర్వహణాధికారి పేరున
స్వీకరించి, ఆయన సంతకంతో రశీదు ఇవ్వాలి. అందుకు
భిన్నంగా ఇవ్వకూడదు.
{పభుత్వం ఇచ్చిన ఆదేశాలను ప్రతి ధర్మకర్త తప్పక పాటించాలి. లేదంటే చర్యలు తీసుకోవచ్చు.
ధర్మకర్తలు దేవాలయ ఆస్తులకు, పేరు ప్రతిష్ఠలకు నష్టం
కలిగించకూడదు. వారి సంబంధీకులకు ఆలయ ఆస్తులను
కట్టబెట్టడం, బహిరంగ వేలంలో లబ్ధి చేకూర్చకూడదు.
యాత్రీకుల వసతి గదుల్లో ధర్మకర్త నివసించకూడదు.
సిబ్బంది ఇంటి అద్దె నిబంధనల మేర చెల్లించాలి.
ఆలయ ఆదాయాన్ని అనుసరించి చేసిన ఉద్యోగ నియామకాలకు భిన్నంగా మార్పులు, చేర్పులు చేయకూడదు.
భక్తులతో సత్ప్రవర్తనతో మెలగడం, ఉన్నతాధికారులకు
తెలియకుండా దేవాలయ భూములు, ఆభరణాలు
విక్రయించడం, అగ్రిమెంట్లు చేయడం నేరం, శిక్షార్హం.