పశ్చిమగోదావరి: విధులు నిర్వర్తించేందుకు వచ్చిన వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన జిల్లాలోని తణుకు ఆర్‌డబ్ల్యూఎస్(తాగునీటి సరఫరా) కార్యాలయంలో చోటుచేసుకుంది. డ్రైవర్‌గా ఆర్‌డబ్య్లూఎస్‌లో విధులు నిర్వర్తిస్తున్న పెంటయ్య(52) ఈ రోజు(మంగళవారం) ఉదయం కార్యాలయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. ఆర్థీక ఇబ్బందుల వల్లె ఆత్మహత్యకకు పాల్పడి ఉంటాడని స్థానికులు భావిస్తున్నారు.