
భద్రతకు మారుపేరు ఆర్టీసీ
అనంతపురం రూరల్: భద్రతకు మరోపేరు ఆర్టీసీ అని, ప్రతి కార్మికుడూ స్వీయ నియంత్రణతో ప్రమాదాల రేటును సున్నా శాతానికి తీసుకురావాలని ఆర్టీసీ ట్రాన్స్‌పోర్టు ఓఎస్‌డీ ఎంవీ రావు, మోటర్ వెహికల్ ఇన్స్‌స్పెక్టర్(ఎంవీఐ) శ్రీనివాసులు సూచించారు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా ఆదివారం ఏర్పాటు చేసిన అవార్డుల ప్రదానోత్సవానికి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఎంవీఐ మాట్లాడుతూ వాహనం నడుపుతూ సెల్ ఫోన్‌లో మాట్లాకూడదని తెలిసీ కొందరు నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు.
ఫలితంగా వెలకట్టలేని ప్రజల ప్రాణాలు, రూ. లక్షల విలువచేసే బస్సులు ప్రమాదానికి గురికావాల్సి వస్తుందన్నారు. కార్మికులు చిత్తశుధ్ధితో విధులు నిర్వర్తించి అవార్డుల కోసం పోటీ పడాలన్నారు. ఓఎస్‌డీ మాట్లాడుతూ భద్రతే ఆర్టీసీ బ్రాండ్ అని అన్నారు. సంస్థలో డ్రైవర్లదే కీలకపాత్ర అన్నారు. కోటి కిలోమీటర్లు తిరిగితే 8 ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. 0 శాతం ప్రమాద రేటు తీసుకురావాలన్నారు.
రాష్ట్రస్థాయిలో తక్కువ ప్రమాదరహిత రేటు శాతాన్ని సాధించిన అనంతపురం డిపో మేనేజర్ రమణ, ఉరవకొండ డిపో మేనేజర్ ప్రశాంతి, కదిరి డిపో మేనేజర్ గోపీనాథ్ ఆర్టీసీ అధికారులు, ఎన్‌ఎంయూ నేతలు సన్మానించారు. డెప్యూటీ సీటీఎం మధుసూదన్, సీఎంఈ శ్రీలక్ష్మి, డీఎంలు మోహన్‌కుమార్, నరసింహులు, బాలచంద్రప్ప, రాజవర్ధన్‌రెడ్డి, ఆర్‌ఎం కార్యాలయం అధికారి వినయ్‌కుమార్, కంట్రోలర్ శివలింగప్ప, తదితరులు పాల్గొన్నారు.
ఉత్తమ సేవలు అందించిన డ్రైవర్ల వివరాలిలా..
జోనల్ స్థాయిలో 3వ స్థానం వైఎన్ రాజు (తాడిపత్రి)
రీజియన్‌లో : వీ ఆంజనేయులు(కదిరి) మొదటిస్థానం,
కేకే మొహిద్దీన్(తాడిపత్రి) రెండో స్థానం, ఏ రామయ్య(తాడిపత్రి)మూడోస్థానం.
డిపోల వారీగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచినవారు..
అనంతపురం : ఎస్ రెహ్మాన్, జీకే మోహిద్దీన్, వీవీ స్వామిజ
గుత్తి : ఆర్ ఈశ్వరయ్య, వీవీ రాముడు, ఎస్ నిజాం
గుంతకల్లు : ఆర్ గోపాల్, టీఏ రెహ్మాన్, ఎన్ ఈరన్న
కళ్యాణదుర్గం : జీ గోవిందు, టీ నాగరాజు, జీ వెంకటేశులు
రాయదుర్గం : వీ శేఖర్, డీజీ నాయక్, బీ నాగేంద్ర
తాడిపత్రి: ఎస్‌ఎం బాష, ఎన్ పెద్దన్న, డీ ఖాసీం
ఉరవకొండ: బీఎస్ వలి, పీఏ మర్తుజ, ఏ వెంకటేశులు
ధర్మవరం : పీకే మోదీన్, సీ అమీర్, ఎస్ మల్లేష్
హిందూపురం : ఎస్ నూరుల్ల, ఏఏ నాయక్, ఈఎన్ రాజు
మడకశిర : ఎంఎన్ స్వామి, ఏడీబీ బేగ్, బీఎస్ నాయక్
కదిరి : ఎస్ మహ్మద్ అలీ, కేఎస్‌ఏ ఖాన్, ఎస్ మహ్మద్‌షఫీ
పుట్టపర్తి : పీహెచ్‌వీ ఖాన్, బీఎఫ్ ఖాన్, జీఎస్ శేఖర్
బెస్ట్ డ్రైవింగ్ ఇన్‌స్ట్రక్టర్లు..
విశ్వనాథ్ (అనంతపురం), ఖలందర్ (కళ్యాణదుర్గం), బీ మోహన్ (గుంతకల్లు), రాముడు (తాడిపత్రి), రాయుడు (ధర్మవరం).
చిత్రలేఖనంలో ప్రతిభ చూపిన విద్యార్థులు : ఎంకే సాయికుమార్ (మొదటి స్థానం), వీ రాజేష్ , టీ బాబు, సీ శివ, ఎస్ వంశీ, కే కార్తీక్, జీ జీవన్‌కుమార్, కే మంజునాథాచారి, ఎం ఇందిర, కే కౌసల్య, పీ రాజేశ్వరి.