కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలన్న ప్రధాన డిమాండ్‌తో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు నిరవధిక సమ్మెతో ప్రభుత్వానికి రూ. కోట్లలో నష్టం వాటిల్లుతోంది. అలాగే జిల్లాలో పాలన స్తంభించిపోయింది. కలెక్టర్, జేసీ, జిల్లా అధికారులు ఉంటున్నా వారికి సహకరించేవారు ఎవరూ లేకపోవడంతో ప్రభుత్వ కార్యక్రమాలు పూర్తిగా నిలిచిపోయాయి. అత్యవసర సేవలు స్తంభించిపోకుండా జిల్లా కలెక్టర్ సి.సుదర్శన్‌రెడ్డి ఫోన్ ద్వారా ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తున్నారు.
పశుసంవర్థక శాఖలో అటెండర్ మొదలుకొని వెటర్నరీ డాక్టర్లు, ఏడీలు, డీడీలు అందరూ సోమవారం నుంచి సమ్మె ప్రారంభించారు. పశువైద్యుల సమ్మె కారణంగా జిల్లా వ్యాప్తంగా 400 పశువైద్యశాలలు మూతపడ్డాయి. దీంతో పశువైద్యసేవలు స్తంభించిపోయాయి.
జిల్లా నుంచి వాణిజ్య పన్నుల శాఖ, గనుల శాఖ, స్టాంపులు-రిజిస్ట్రేషన్‌ల శాఖ, రవాణ శాఖ, ఎక్సైజ్ తదితర వాటి ద్వారా ప్రతిరోజు సగటున ప్రభుత్వానికి రూ.2 కోట్ల ఆదాయం జమ అవుతుంది. ఇదంతా ట్రెజరీల ద్వారా ప్రభుత్వానికి వెలుతోంది. ఈ శాఖలతో పాటు ట్రెజరీ సిబ్బంది మొత్తం సమ్మెలో ఉండటం వల్ల ప్రభుత్వ ఆదాయం పడిపోయింది. ఆన్‌లైన్ ద్వారా రూ.25 లక్షల వరకు జమ అవుతున్నా దాదాపు రూ.1.75 కోట్లు నిలిచిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. మంగళవారం నుంచి అంగన్‌వాడీ కార్యకర్తలు, సూపర్‌వైజర్లు సమ్మె చేపట్టనుండటంతో చిన్నారులు, గర్భిణి లు, బాలింతలకు పోషకాహార పంపిణీ నిలిచిపోనుంది.
కర్నూలు సర్వజన వైద్యసిబ్బంది, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది సమ్మెలోకి వెళ్లడంతో అత్యవసర వైద్యసేవలే అందుతున్నాయి. దీంతో ప్రతిరోజూ ఓపీకి వచ్చే రోగుల సంఖ్య గణనీయంగా పడిపోయింది.
సోమవారం జరగాల్సిన ప్రజాదర్బార్ జరగలేదు. డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని కలెక్టర్ నిర్వహించినా, తర్వాత నిర్వహించాల్సిన ప్రజాదర్బార్ నిర్వహించలేకపోయారు.
ఏడో రోజు కదలని బస్సులు
కర్నూలు(రాజ్‌విహార్), న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర నినాదంతో ఆర్టీసీ కార్మిక సంఘాలు చేపట్టిన నిరవధిక సమ్మె ఏడో రోజు సోమవారం కూడా కొనసాగింది. జిల్లాలోని 11డిపోల్లో ఉన్న 970 బస్సు లు డిపోలకే పరిమితమయ్యాయి. దాదాపు రూ. కోటి ఆదాయాన్ని కోల్పోయినట్లు తెలుస్తోంది.
ప్రభుత్వ ఆదాయం రోజు రూ.కోటి పడిపోయింది
ట్రెజరీ ఉద్యోగులతో పాటు ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చే శాఖల ఉద్యోగులందరూ సమ్మెలోకి వెళ్లడంతో ప్రభుత్వం రోజూ రూ.కోటి ఆదాయాన్ని కోల్పోతుంది. అయితే ఆన్‌లైన్ ద్వారా స్వల్పంగా ఆదాయం జమ అవుతోంది. సమ్మెలో ఉన్న ఉద్యోగులకు నో వర్క్ - నో పే అమలు చేయాలని ఆర్థిక శాఖ నుంచి ఆదేశాలు వచ్చాయి. వీటిని అమలు చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. ఇంతవరకు ఏయే శాఖలు సమ్మెలో ఉన్నాయనే సమాచారం పూర్తిగా రాలేదు. సమ్మెలో ఉన్నవారికి జీతాలు చెల్లించడం జరగదు.
- సుధాకర్, డీడీ, జిల్లా ట్రెజరీ
సమ్మె ఉద్ధృతం.. రూ.కోట్లలో నష్టం
Published Tue, Aug 20 2013 1:01 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
Advertisement