ఉట్నూర్/కాసిపేట, న్యూస్‌లైన్ : జిల్లాలోని షెడ్యూల్డ్ కులాలు(ఎస్సీ), షెడ్యూల్డ్ తెగల(ఎస్టీ) కుటుంబాలకు ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందించాలని సంకల్పించింది. 0 నుంచి 50 యూనిట్ల లోపు కరెం టు వినియోగించుకున్న కుటుంబాలకు ఎస్టీ, ఎస్టీ ఉపప్రణాళిక కింద బిల్లు మాఫీ చేస్తారు. ఇందుకోసం జిల్లావ్యాప్తంగా అర్హులైన ఎస్సీ, ఎస్టీలను గుర్తించే బాధ్యతను ప్రభుత్వం సాంఘిక సంక్షేమ శాఖ, ఏజెన్సీ అధికారులకు అప్పగించిం ది. వీరు 20,260 ఎస్సీ, 17,734 ఎస్టీ కుటుంబాలు ఉన్నాయని రచ్చబండ సందర్భంగా తెలిపారు.
రూ.18.20 కోట్లు మాఫీ 0-50 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించుకున్న ఎస్సీ, ఎస్టీలను సెప్టెంబర్ నుంచే అధికారులు గుర్తిస్తున్నారు. సెప్టెంబర్ నుంచి ఏప్రిల్ వరకు అంటే ఆరునెలలు 50 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించుకున్న కుటుంబాల వారు చెల్లించిన బిల్లులను తిరిగి ప్రభుత్వం చెల్లిస్తోంది. ఏ రూపకంగా చెల్లిస్తుందనేది ప్రభుత్వం ప్రకటించనుంది. దీని ప్రకారం జిల్లాలో దాదాపు రూ.18.20 కోట్ల బిల్లులు ప్రభుత్వం మాఫీ చేసే అవకాశం ఉంది.
ఇందుకోసం మండలాల్లో 50 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే ఎస్సీ, ఎస్టీలు వారి కుల ధ్రువీకరణ పత్రాలు విద్యుత్ కార్యాలయాల్లో సమర్పించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అధికారులు ప్రచారం కల్పించక పోవడంతో కుల ధ్రువీకరణ పత్రాలు సమర్పించడం లేదు. పూర్తిస్థాయిలో బిల్లు చెల్లిస్తున్నారు. కొందరు బిల్లులు చెల్లించడం లేదని విద్యుత్ శాఖ అధికారులు ఎస్సీ, ఎస్టీ గూడాలకు విద్యుత్ సౌకర్యం నిలిపివేస్తున్నారు.
వారం రోజులుగా చీకట్లోనే..
ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ వర్తించే కాసిపేట మండలం ఇప్పలగూడ, రేగులగూడ గ్రామాల ప్రజలు అంధకారంలో మగ్గుతున్నారు. రెండు గ్రామాల్లో 33 కుటుంబాలకు చెందిన 180 మంది బిక్కుబిక్కమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. రాత్రయిందంటే అందరూ ఒకటే చోట చేరుతున్నారు. దీపాల వెలుతురులో వంటలు చేసుకుని భోజనం చేస్తున్నారు. చంటి పిల్లలను వేసుకుని చీకట్లోనే నిద్రిస్తున్నారు.
విషపురుగులు, క్రూరమృ గాలు రాకుండా మంటలు వేసుకుంటున్నారు. భయటకు వెళ్లాలంటే జంకుతున్నారు. అసలే తూర్పు ప్రాంతంలో పులి సంచరిస్తోంది. దాని భారిన పడితే అందరూ మృత్యువాత పడే అవకాశం ఉంది. జైపూర్ పవర్ ప్లాంటు కేంద్రానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉండే గ్రామాల పరిస్థితి ఇలా ఉంటే మిగతా ఏజెన్సీలో ఉండే గ్రామాల పరిస్థితి ఏవిధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
రూ. వేలల్లో బిల్లులు
అధికారులు ఎటువంటి సమాచారం లేకుండా బిల్లులు చెల్లించలేదని కరెంటు కట్ చేశారు. ఇక మాకు 30 యూనిట్లు కూడా కరెంటు వినియోగం కాదు. మేమందరం ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు అర్హులమే. 50 యూనిట్లలోనే అందరం కరెంటు వినియోగించుకుంటాం. బిల్లులు మాత్రం రూ.వేలల్లో వస్తున్నాయి. విద్యుత్ అధికారులు ఎప్పుడు వస్తారో, ఎప్పుడు వెళ్తారో తెలియదు. మేము కూలీకి వెళ్లేచ్చే వరకు బిల్లు మాత్రం తలుపులకు ఉంటుంది.
తొమ్మిది నెలల నుంచి బిల్లుకట్టని మాట వాస్తవామే సబ్‌ప్లాన్‌లో మాఫీ చేయడం తరువాత ఒక్కొక్కరికి రూ.4 వేల నుంచి రూ.12 వేల వరకు బిల్లులు వచ్చాయని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీలకు యాభై యునిట్లలోపు ఉచిత విద్యుత్ పథకం పూర్తిస్థాయిలో అమలు కాకముందే ఆయా గూడాలకు విద్యుత్ నిలిపి వెయ్యడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇప్పటికైన అధికారులు వెంటనే విద్యుత్ పునరుద్ధరించాలని.. లేకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని గిరిజనులు పేర్కొంటున్నారు.
చీకట్లోనే..
Published Thu, Jan 30 2014 3:25 AM | Last Updated on Sat, Sep 15 2018 6:02 PM
Advertisement
Advertisement