ఇంకు గుంటల పథకానికి పేరు మార్చి మళ్లీ ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. 2004 ముందు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా వర్షం నీరు వృధా కాకుండా
శ్రీకాకుళం: ఇంకు గుంటల పథకానికి పేరు మార్చి మళ్లీ ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. 2004 ముందు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా వర్షం నీరు వృధా కాకుండా ఉండేందుకు ఇంకుడు గుంటల పథకాన్ని ప్రారంభించారు. కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రభుత్వ కార్యాలయాల్లోనూ, పాఠశాల్లోనూ ఇటువంటి ఇంకుడు గుంటలను ప్రారంభించారు. అప్పట్లో కోట్లాది రూపాయలు వెచ్చించినా అవి బూడిదలో పోసిన పన్నీరే అయింది. అటువంటి గుంటలు ప్రస్తుతం ఎక్కడా కనిపించడంలేదు. భూగర్భ జలాలు అడుగంటుతున్న నేపథ్యంలో ఇటువంటి పథకాలు అవసరమే అయినప్పటికీ చిత్తశుద్ధి కొరవడడంతో కోట్లాది రూపాయలు వృథా అవుతున్నాయి. ఇటువంటి పథకానికి మళ్లీ పేరు మార్చి ‘రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్’ పేరిట మళ్లీ ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది.