ఇందూరు, న్యూస్‌లైన్: మొన్న మొన్నటి వరకు కళాశాలలో చదువుతున్నట్లు ప్రిన్సిపాల్ సంతకంతో కూడిన ధ్రువీకరణ పత్రం, రేషన్‌కార్డు జిరాక్స్, బ్యాం కు ఖాతా, కుల, ఆదాయ ధ్రువీకరణపత్రాల ను దరఖాస్తు ఫారానికి జత చేస్తే మార్చిలోగా ఉపకార వేతనాలు వచ్చేవి. కానీ, ఇప్పుడున్న ప్రభుత్వం పైవాటితో పాటు ఆధార్ కార్డు, సొంత సెల్‌ఫోన్ నంబరుతో విద్యార్థులే నేరుగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కొన్ని నెల ల క్రితం నిబంధన విధించింది. ఈ నిబంధన లు సరిపోవన్నట్లుగా ఉపకార వేతనాల దర ఖా స్తుల పరిశీలన అధికారుల వ్యవస్థను రద్దు చేసి, ఆ బాధ్యతలను సంబంధిత కళాశాలల యాజ మాన్యాలకే అప్పగించింది. ఇక బయోమెట్రిక్ మెషిన్ ద్వారా విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించాలని, దీనికి విద్యార్థి వేలి ముద్రతో పాటు, కళాశాల ప్రిన్సిపాళ్ల సంతకం కూడా తప్పని సరిగా ఉండాలని, అయితేనే ఉపకార వేతనాలు మంజురు అవుతాయని కొత్త కొత్త షరతులు పెట్టి తల నొప్పిగా మా ర్చుతోంది ప్రభుత్వం. దీంతో ఉపకారం పేద విద్యార్థులకు అందని ద్రాక్షలా మారుతోంది.
ఇదీ పరిస్థితి
జిల్లాలో ప్రభుత్వ, ప్రయివేటు కళాశాలు కలిపి సూమారు 280 వరకు ఉన్నాయి. ఇందులో ఫ్రెష్, రెన్యూవల్ ఉపకార వేతనాలకు దరఖాస్తులు చేసుకున్న ఎస్‌సీ, ఎస్ టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు దాదాపుగా 80 వేలకు పైగా ఉన్నారు. వీరిలో 15 శాతం మందికి ఆధార్ కార్డు రాకపోవడం, సొంత సెల్‌ఫోన్‌లు లేకపోవడంతో ఇప్పటి కీ ఆన్‌లైన్‌లోకి ఎంట్రీ కావడం లేదు. సెల్‌ఫోన్ నెంబరు లేకపోడం ప్రధాన సమస్యగా మారింది. ఉపకార వేతనాలకు దరఖాస్తులు చేసుకునే వారందరు పేద విద్యార్థు లే కావడంతో సెల్‌ఫోన్‌ను వాటడంలేదు. వాడినవారికీ సమస్యగానే మారింది. ఎందుకంటే, ఉపకార వేతనాలు రెన్యూవల్ కావాలంటే సెల్ నంబరుకు ఒక హై సెక్యూ రిటీ నంబరును మెసేజ్ ద్వారా పంపుతారు. అది వచ్చిన మరుక్షణమే సంబంధిత కళాశాల వారు ఫోన్ చేసి ఆ నంబరు చెప్పమంటారు. అది చెబితేనే ఉపకార వేతనం పొందటానికి అర్హూలు. లేదంటే అనర్హూలవుతారు. ఈ నిబంధనతో జిల్లావ్యాప్తంగా రెండు నుంచి మూడు వేల మంది వరకు విద్యార్థులు తమ ఉపకార వేతనాన్ని నష్ట పోయినట్లు సంక్షేమాధికారులు, కళాశాలల ప్రిన్సిపాళ్లు అంచనా వేశారు. అంటే ప్రభుత్వం పెట్టిన లేనిపోని నిబంధనలతో వారికి అన్యాయం జరిగినట్టే.
భయపెట్టిస్తున్న బయోమెట్రిక్ విధానం
ఇంత జరుగుతున్నా ప్రభుత్వం పట్టనట్లుగా వ్యవహరిస్తోంది. నెలకో నిబంధన, కొత్త విధానాలంటూ అసలుకే ఎసరు పెడుతోంది. నెల రోజుల క్రితం కొత్తగా బ యో మెట్రిక్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. అమలు చేసేందుకు చర్యలు కూడా ప్రారంభించింది. ఈ విధానంపై ప్రిన్సిపాళ్లు, జిల్లా సంక్షేమాధికారులకు అవగాహన కలిగించేందుకు సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్ నిర్వహించాలనుకున్న వీడియో కాన్ఫరెన్స్ వాయిదా పడుతూ వస్తోంది. ఉపకార వేతనం పొందాలంటే ప్రతి విద్యార్థి వేలిముద్ర కచ్చితంగా బయోమెట్రిక్ యంత్రంలో నమోదు కావాలి. దానితోపాటు సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్ సంతకం కూడా ఉండాలి. ఇటు విద్యార్థి ఆధార్ కార్డులో నమోదు చేసిన వేలి ముద్రలు, బయోమెట్రిక్ మెషిన్‌లో నమోదు చేసిన వేలిముద్రలు సరిపోలకుంటే ఆ విద్యార్థికి ఉపకార వే తనం రానట్లే.
మూడు నెలలలో ఎలా సాధ్యం?
ఉపకార వేతనాలను ఎగవేసే కుట్రలో భాగంగానే బయోమెట్రిక్ మెషిన్ విధానాన్ని ప్రవేశపెట్టారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విద్యా సంవత్సరం మార్చితో ము గియనుంది. ఇంకా యంత్రాలు జిల్లాకు రాలేదు. ఈ పాటికే అధికారులు ప్రక్రియను పూర్తి చేసి ఉండాలి. ప్రభుత్వం దీనికి వ్యవధిని నిర్ణయించకపోవడంతో నిధులు ఎ ప్పుడు విడుధల అవుతాయో అర్థకాని పరిస్థితి నెలకొంది. 80 వేల మందితో వేలిముద్రలు తీసుకోవడం, అవి ఆధార్‌లో ఉన్న వేలి ముద్రలతో సరిచూడడం కష్టసాధ్యం అవుతుందని ప్రిన్సిపాళ్లు పేర్కొంటున్నారు. బయోమెట్రిక్ మెషిన్‌లను కళశాలల యాజమాన్యాలే కొనుగోలు చేసుకోవాలని సర్కారు మరో తిరకాసు పెట్టింది. ఒక్కో మె షిన్ రూ.30 వేల వరకు ఉండటంతో తాము సొంత నిధులతో ఎలా కొనుగోలు చేయాలని ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ కొన్నా విద్యార్థుల నుంచే డబ్బులు వసూలు చేయాలని కళాశాలల యాజమాన్యాలు నిర్ణయించుకున్నట్లు సమాచారం. ప్రభుత్వ కళాశాలలు మాత్రం ప్రభుత్వం ఇచ్చే నిధులతో కొనుగోలు చేయాలని సూచించింది.
ప్రభుత్వ నిర్ణయం సరికాదు
విద్యార్థులకు మంజూరు చేసే ఉపకార వేతనాల విషయంలో ప్రభుత్వం నెలకో నిర్ణయం తీసుకుంటోంది. బయోమెట్రిక్ మెషిన్, సొంత సెల్ ఫోన్ నంబరు విధానం తో విద్యార్థులు ఉపకారానికి దూరం అయ్యే అవకాశం ఉంది. పేద విద్యార్థుల దగ్గర సెల్‌ఫోన్‌లు ఎలా ఉంటాయి? బయోమెట్రిక్ మెషిన్‌లను ఎవరికివారే కొనుక్కోవడ ం, వేలి ముద్రలు తీసుకోవడం యాజమాన్యాలకు అదనపు భారమే.
- ప్రవీణ్ కుమార్, శ్రీసాయి జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్,నందిపేట్
ఉపకారం దూరం
Published Mon, Dec 30 2013 6:55 AM | Last Updated on Sat, Sep 15 2018 4:12 PM
Advertisement