ఇందూరు: ఫాస్ట్ (ఫైనాన్సియల్ అసిస్టెన్స్ టు స్టూడెంట్స్ ఆఫ్ తెలంగాణ).. పేరుకే పరిమి తమైంది. ఈ పథకం సక్రమంగా వేగవంతంగా అమలుకు నోచుకోవడం లేదు. కొత్త ప్రభుత్వం కొలువు దీరి దాదాపు మూడు నెలలు పూర్తయినప్పటికీ తెలంగాణ విద్యార్థులకు ఆర్థిక సహాయానికి సంబంధించిన ఎలాంటి స్పష్టమైన ఆదేశాలు గానీ, మార్గదర్శకాలు గా నీ రాలేదు.
ఫీజు రీయింబర్స్‌మెంటు చెల్లిం పులో తెలంగాణ విద్యార్థులకు స్థానిక తను 1956 సంవత్సరంగా ప్రభుత్వం తేల్చినా 2013-14 విద్యా సంవత్సరానికి సంబంధిం చిన బీసీ, ఈబీసీ విద్యార్థులకు నేటి వరకు ఒక్క పైసాను కూడా విడుదల చేయలేదు. ఫీ జులు రాకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇ బ్బందులు పడుతున్నారు. ఫీజులు చెల్లించాల ని మరోవైపు కళాశాల యాజమాన్యాలు వి ద్యార్థులను తీవ్ర ఒత్తిడికి గురి చేయిస్తున్నాయి.
కోర్సు పూర్తై విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయి. ‘ప్రభుత్వం నుంచి ఫీజులు వచ్చే వరకు అగండి, లేదా మీ జేబుల్లోంచి ఫీజులు కట్టి సర్టిఫికెట్లు తీసుకెళ్లండి’ అని కళాశాల యాజమాన్యాలు విద్యార్థులకు ఖరాఖండిగా చెప్పేస్తున్నాయి. దీంతో కోర్సు పూర్తి చేసిన విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కోర్సు పూర్తి చేసిన సర్టిఫికెట్‌తో పాటు, టీసీ, ఇతర సర్టిఫికెట్లు క ళాశాల యాజమాన్యాలు ఇవ్వకపోవడంతో వారు తదనంతర చదువుకు దూరమవుతున్నారు. దీంతో తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారు.
రూ. కోట్ల బకాయిలు
2013-14 విద్యా సంవత్సరానికి గాను జిల్లాలో ఇంటర్ నుంచి పీజీ వరకు చదువుతున్న బీసీ విద్యార్థులు 51154 మంది, ఈబీసీ విద్యార్థులు 3555 మంది ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. అయితే స్కాలర్‌షిప్ నిధులను ప్రభుత్వం విడతల వారీగా మంజురు చేసింది. ఇంకా దాదాపు రూ. 6 కోట్లు జిల్లాకు మంజురు కావాల్సి ఉంది.
ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులను కూడా కొద్ది మందికే అందించి, మిగతా నిధులను విడుదల చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో ఏడాది కాలంగా వాటికోసం విద్యార్థులు, కళాశాల యాజమాన్యాలు నిరీక్షిస్తున్నాయి. 32, 216 మంది బీసీ విద్యార్థులకు సంబంధించిన రూ. 20 కోట్లు జిల్లాకు రావాల్సి ఉంది. ఈ నిధులను వెంటనే విడుదల చేయాలని విద్యార్థులు, విద్యార్థి సంఘాలు రోడ్డెక్కి ఆందోళనలు, ధర్నాలు, రాస్తారోకోలు చేశాయి. ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడించి విద్యార్థులు లాఠీ దెబ్బలూ తిన్నారు. చివరికి అరెస్టు కూడా అయ్యారు.
శాంతియుతంగా పోస్టు కార్డుల ఉద్యమం, అధికారులకు వినతులు సమర్పించినా, రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా నిమ్మకు నీరెతినట్లుగా వ్యవహరిస్తుండటం విద్యార్థులకు అవేశాన్ని, ఆగ్రహం, అసహనాన్ని కలిగిస్తున్నాయి. రీయింబర్స్‌మెంట్ నిధులు ఎప్పుడు వస్తాయి...? అసలు వస్తాయా...?రావా..? అని అధికారులను అడిగి తెలుసుకునేందుకు బీసీ విద్యార్థులు కలెక్టర్ కార్యాలయంలోని బీసీ సంక్షేమ శాఖ కార్యాలయం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు.
యూసీలివ్వని కాలేజీలు..
2007-08 విద్యా సంవత్సరం నుంచి ఈ ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం అమలవుతోంది. ముఖ్యంగా ఈ పథకాన్ని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టారు. ఈ పథకాన్ని భేదాలు లేకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ విద్యార్థులకు సక్రమంగా అమలు చేసి జిల్లాలోని ఎందరో మంది విద్యార్థులకు బంగారు భవిష్యత్తునిచ్చారు. కాని మారుతున్న ప్రభుత్వాలు పథకం రూపు రేఖలను, నిబంధనలను మార్చడంతో విద్యార్థులకు ఉపకారం అందని ద్రాక్షలాగా మారుతోంది.
అయితే నాటి నుంచి నేటి వరకు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ నిధులను జిల్లాకు కోట్లాది రూపాయల్లో మంజురు చేశారు. కానీ విద్యార్థుల వివరాలు పొందుపరిచిన యుటిలైజేషన్ సర్టిఫికెట్లు(యూసీ) పూర్తి స్థాయిలో ఇవ్వలేదని తెలుస్తోంది. ఆన్‌లైన్ ద్వారా వివరాలు పంపే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించినా యూసీలు ఇచ్చేందుకు కళాశాల యాజమాన్యాలు నిరాకరిస్తున్నాయి. ఇలా యూసీలు ఇవ్వకపోతే ఫీజు బకాయిలు చెల్లించేందుకు ఇబ్బందులు ఎదురవుతాయి.
ప్రారంభం కాని కొత్త దరఖాస్తులు
గత సంవత్సరానికి చెందిన బీసీ విద్యార్థుల పరిస్థితి ఇలా ఉంటే ఇక నాలుగు నెలల క్రితం కొత్తగా ప్రవేశాలు పొందిన విద్యార్థుల పరిస్థితి కూడా అయోమయంగా మారింది. ఈ ఏడాదికి సంబంధించి ఫీజులు, స్కాలర్ షిప్‌ల కోసం దరఖాస్తులు చేసుకునేందుకు ఇంకా ఆన్‌లైన్ ప్రక్రియ పూర్తి కాలేదు. ఫాస్ట్ మార్గదర్శకాలు ఖరారు అయితే తప్పా ఆన్‌లైన్ నమోదు కుదరదని అధికారులు చెబుతున్నారు.
ఫాస్ట్.. పాట్లు
Published Sun, Sep 7 2014 1:08 AM | Last Updated on Tue, Oct 2 2018 5:51 PM
Advertisement
Advertisement