వేమనపల్లి, న్యూస్‌లైన్ :
ఒక్కగానొక్క కొడుకు జులారుుగా తిరుగుతుండడం భరించలేక తల్లి మందలించింది. మ నస్తాపం చెందిన కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన వేమనపల్లి మండలం నీ ల్వారుు గ్రామంలో శుక్రవారం జరిగింది. పోలీ సుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పా రుురాల వెంకటమ్మ, శ్రీనివాస్ దంపతులకు కు మార్తె, కుమారుడు ఉన్నారు. శ్రీనివాస్ ఉపాధి నిమిత్తం మహారాష్ట్రలో పనిచేస్తూ అక్కడే ఉంటున్నాడు. కుమార్తెకు ఇటీవలే వివాహం చేశారు. కుమారుడు శ్రీకాంత్ (23) కూలీగా పనిచేస్తున్నాడు. కొంతకాలంగా పనికి వెళ్లకుండా జులారుుగా తిరుగుతున్నాడు. పనికి వెళ్లాలని పలుమార్లు తల్లి కోరినా వినిపించుకోలేదు. పనీపాట లేకుండా ఎంతకాలం తిరుగుతావని తల్లి శుక్రవారం మందలించింది. మనస్తాపం చెందిన శ్రీ కాంత్ క్రిమిసంహారక మందు తాగాడు. స్థాని కులు గమనించి 108లో ఆస్పత్రికి తరలిస్తుండ గా మార్గమధ్యంలో చనిపోయూడు. ఒక్కగానొక్క కొడుకు మృతితో ఆ తల్లి గుండెలవిసేలా రోదించడం స్థానికులను కలచివేసింది. మృతదేహాన్ని పోస్టుమార్టమ్‌కు పంపి కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై సంజీవ్ తెలిపారు.
భార్య మందలించిందని భర్త..
సారంగాపూర్ : మద్యం మానేయూలని భార్య మందలించడంతో భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని రవీంద్రనగర్ తండా లో జరిగింది. సారంగాపూర్ ఎస్సై లింగమూర్తి, మృతుడి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. రవీంద్రనగర్ తండాకు చెందిన బత్తుల బాబు (45) కొంతకాలంగా మద్యానికి బానిసయ్యూ డు. ఈ క్రమంలో శుక్రవారం మద్యం తాగి ఇం టికి తూలుతూ వచ్చిన బాబును అతడి భార్య శాంతాబారుు మందలించింది. క్షణికావేశానికి గురైన అతడు తాగిన మైకంలో క్రిమిసంహారక మందు తాగాడు. గమనించిన శాంతాబారుు స్థానికుల సాయంతో నిర్మల్ ఏరియూ ఆస్పత్రికి తరలించింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప రిస్థితి విషమించి సాయంత్రం చనిపోయూడు.కే సు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
తల్లి మందలించిందని కొడుకు ఆత్మహత్య
Published Sat, Oct 5 2013 1:16 AM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM
Advertisement
Advertisement