
సముద్రతీరం 40 అడుగుల ముందుకు
అలల తాకిడికి కొట్టుకుపోతున్న శవపేటికలు
విశాఖపట్నం, న్యూస్‌లైన్: ఎన్నడూలేని విధంగా యారాడ సముద్రతీరం 40 అడుగుల ముందుకు వచ్చి సమీపంలోని శ్మశానవాటికను తాకుతోంది. ఈ కారణంగా ఇక్కడ పూడ్చిన శవపేటికలు కొట్టుకుపోయే పరిస్థితి ఎదురవుతోంది. తీరానికి 50అడుగులు దూరంలో శ్మశానవాటిక ఉన్నప్పటికీ ఇటువంటి పరిణామం ఎదురవడంతో గ్రామస్తులు కలత చెందుతున్నారు.స్థానికులు శనివారం గాజువాక రెవెన్యూ అధికారులను పిలిచి సమస్యను వివరించారు. 80 ఏళ్లుగా ఎన్నడూలేని విధంగా కెరటాలు ఒక్కసారే 40 అడుగులు ముందుకు రావడంపై గ్రామస్తులు కలవరపడుతున్నారు.