రాజీనామా చేయకపోవడం సిగ్గుచేటు
Published Sun, Sep 8 2013 2:34 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
జెఎన్‌టీయూ (విజయనగరం రూరల్), న్యూస్‌లైన్: సీమాంధ్ర ప్రజలు ఆందోళనలు చేపట్టి నెల రోజులు దాటుతున్నా పాలకులు తమ పదవులకు రాజీనామా చేయకపోవడం సిగ్గుచేటని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త గురాన అయ్యలు అన్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా శనివారం స్థానిక జాతీయ రహదారిపై జగన్‌మోహన్‌రెడ్డి మాస్కులు ధరించి బైఠాయించారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అలాగే కేసీఆర్ డౌన్ డౌన్, బొత్స డౌన్ డౌన్, సోనియా డౌన్ డౌన్ అంటూ నినదించారు. అనంతరం అయ్యలు మాట్లాడుతూ, స్వార్థ రాజకీయం కోసం రాష్ట్రాన్ని విడగొట్టడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా సీమాంధ్ర పాలకులు బుద్ధి తెచ్చుకుని రాష్ర్ట విభజనను వ్యతిరేకించాలన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు ఆదాడ మోహనరావు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు. జేఎన్‌టీయూ(కె) విద్యార్థులు కళాశాల కూడలి, జాతీయ రహదారి పక్కన రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. సమైక్య రాష్ట్రానికి మద్దతుగా నినాదాలు చేశారు.
Advertisement
Advertisement