మరో ప్రజాప్రస్థానంలో భాగంగా షర్మిల చేపట్టిన పాదయాత్ర నేడు ఇచ్ఛాపురంలో ముగియనుంది.
దివంగత ముఖ్యమంతి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ షర్మిల మరో ప్రజాప్రస్థానంలో భాగంగా చేపట్టిన పాదయాత్ర ఆదివారం బలరాంపురం నుంచి ప్రారంభమైంది. సరవదేవిపేట, అయ్యవారిపేట,లొద్దపుట్టి మీదుగా ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతమైన ఇచ్చాపురం పట్టణం చేరుకుంటారు. దాంతో ఆమె ప్రారంభించిన పాదయాత్ర నేటితో ముగియనుంది.
ఇచ్చాపురంలో ఆదివారం జరగనున్న బహిరంగ సభలో ఆమె ప్రసంగించనున్నారు. నేటితో ఆమె ప్రారంభించిన పాదయాత్ర 230వ రోజుకు చేరుకుంది. 9 నెలల కాలంలో 14 జిల్లాల్లోని 116 నియోజకవర్గాల మీదుగా ఆమె పాదయాత్ర కొనసాగింది. 3,112 కిలోమీటర్ల మేర షర్మిల పాదయాత్రలో భాగంగా నడిచి దేశరాజకీయ చరిత్రలో ఓ సంచలన రికార్డును సృష్టించారు.