
స్థానిక ఎన్నికల్లో సత్తా చాటండి
ఆళ్లగడ్డ, న్యూస్‌లైన్: ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలకు స్థానిక ఎలక్షన్లు ఫ్రీ ఫైనల్ లాంటివని, అందులో సత్తా చాటాలని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి అన్నారు. సోమవారం ఆమె చాగలమర్రి, రుద్రవరం, ఆళ్లగడ్డ మండల పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో సమర్థవంతమైన నాయకులను బరిలో దింపేందుకు ప్రణాళిక రూపొందించాలన్నారు. మెజార్టీ స్థానాల్లో గెలుపొంది గ్రామాల్లో వైఎస్‌ఆర్‌సీపీ బలం ప్రత్యర్థులకు చూపించాలన్నారు.
మహానేత వైఎస్‌ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రవేశ పెట్టిన పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. పార్టీ అధికారంలోకి వస్తే జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టేబోయే సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించాలని తెలిపారు. ముఖ్యంగా అమ్మఒడి, పింఛన్‌ల పెంపు, డ్వాక్రా రుణాల రద్దు, రైతులకు 3వేల కోట్లతో స్థిరీకరణ నిధి పథకాలపై విస్తృత ప్రచారం చేయాలన్నారు.
అలాగే వైఎస్‌ఆర్ హయాంలో లబ్ధిపొందిన కుటుంబాలను గుర్తించి స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో వారి గురించి ప్రజలకు వివరించాలన్నారు. చంద్రబాబు నాయుడు మాటలను ప్రజలు నమ్మడం లేదన్నారు. టీడీపీ పాలనలో ప్రజలు పడిన కష్టాలు,ై వెఎస్‌ఆర్ హయంలో ప్రజలకు అందిన పథకాలను అర్థమయ్యేరీతిలో ప్రజలకు వివరించాలన్నారు. ఆళ్లగడ్డలో వైఎస్సార్సీపీని ఎదుర్కొనలేక కాంగ్రెస్, టీడీపీ నాయకులు ఏకమయ్యారని, అయినా తమ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని పేర్కొన్నారు.
కార్యక్రమంలో రుద్రవరం మండల నాయకులు సత్యనారాయణ, రంగనాయకులు, ప్రతాపరెడ్డి, చాగలమర్రి నాయకులు నిజాముద్దీన్, రఘునాథ్‌రెడ్డి, రామగురివిరెడ్డి, అన్సర్‌బాషా, జగద్వీశర్‌రెడ్డి, ఆళ్లగడ్డ నాయకులు చంద్రశేఖర్‌రెడ్డి, రాముయాదవ్, శ్రీనివాసరెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, బీవీ రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
హ్యాండ్లూమ్ బోర్డు మెంబర్‌గా గడ్డం వెంకటేష్ నాయక్
కర్నూలు(సిటీ), న్యూస్‌లైన్: ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ బోర్డు మెంబర్‌గా గిరిజనుడైన గడ్డం వెంకటేష్ నాయక్‌ను నియమించడంతో గిరిజన ఐక్యవేదిక అధ్యక్షుడు వెంకటస్వామి కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ హ్యాండ్లూమ్ బోర్డు మెంబర్‌గా రెండు సంవత్సరాల కాల వ్యవధితో కూడిన నామినేటెడ్ పదవి ఎస్టీ వ్యక్తికి కేటాయించడం అభినందనీయమన్నారు.
19వ తేదీన ఢిల్లీ నుండి కర్నూలుకు వస్తున్న వెంకటేష్ నాయక్‌కు ఘన స్వాగతం పలుకనున్నట్లు చెప్పారు. సమావేశంలో గిరిజన ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు క్రిష్ణానాయక్, ఆల్ ఇండియా బంజారా సేవ సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటరమణ నాయక్, ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు చంద్రప్ప పాల్గొన్నారు.
సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలి
కల్లూరు రూరల్, న్యూస్‌లైన్: నందికొట్కూరు మార్కెట్‌యార్డు వైస్ చైర్మన్ సాయిఈశ్వరుడు హత్య కేసును సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి నిజాలను నిగ్గు తేల్చాలని రాయలసీమ గంగపుత్ర హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు బి.శివనవీన్‌కుమార్ డిమాండ్ చేశారు. కర్నూలు లక్ష్మీనివాస్ లాడ్జీలో సోమవారం ఆయన ఆయన అధ్యక్షతన వివిధ కుల సంఘాలు, ప్రజాసంఘాల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా శివనవీన్‌కుమార్ మాట్లాడుతూ బీసీల రాజకీయ ఎదుగుదలను ఓర్చుకోలేక ప్రత్యర్థులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని ఆరోపించారు.
నిందితులను వెంటనే అరెస్టు చేయాలన్నారు. రాజకీయంగా ఎదుగుతున్న ఎంబీసీ నాయకులను (ఆనాడు కప్పట్రాళ్ల వెంటప్పనాయుడు, దళ్వాయి రామయ్య, జింకల వెంకటేశ్వర్లు, ఆళ్లడ్డ నాయకులు ఆచారి సోదరులు, నేడు సాయిఈశ్వరుడు) కడతేరుస్తున్నారని ఎంబీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసుల వైఫల్యంతోనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని, పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు. సమావేశంలో వాల్మీకి ఐక్యపోరాట సమితి జిల్లా అధ్యక్షుడు జె.శ్రీనివాసనాయుడు, తెలుగు సంఘం నాయకులు పుల్లయ్య, మైనారిటీ నాయకులు ఆరిఫ్, శివ పాల్గొన్నారు.