
శ్రీశైలంలో 17 నుంచి శివరాత్రి వేడుకలు
శ్రీశైలంలో ఈ నెల 17 నుంచి 26 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు.
శ్రీశైలం: ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో ఈ నెల 17 నుంచి 26 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఈవో నారాయణ భరత్ గుప్తా ఆదివారం విలేకరులకు తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని 17 నుంచి ఆలయంలో ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నామని పేర్కొన్నారు. అందరికీ మల్లన్న దర్శనభాగ్యం కల్పించేందుకు 22 నుంచి స్పర్శదర్శనాన్ని నిలుపుదల చేస్తున్నామని చెప్పారు. టీటీడీ 18న , రాష్ట్ర ప్రభుత్వం 21న.. పట్టువస్త్రాలను సమర్పిస్తాయని తెలిపారు. మహాశివరాత్రి పర్వదినం 24న వస్తుందని, అ రోజు రాత్రి 10 గంటలకు లింగోద్భవకాల మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, రాత్రి 10.30కు పాగాలంకరణ, అర్ధరాత్రి 12 గంటలకు కల్యాణోత్సవం నిర్వహిస్తామని చెప్పారు.