విజయనగరం రైల్వే పోలీస్‌స్టేషన్‌కు ఎస్‌ఐగా ఎవరు వచ్చినా.. ఆరు నెలలకే బదిలీ అవుతున్నారు. ఎస్‌ఐ నుంచి సీఐలుగా
విజయనగరం క్రైం, న్యూస్‌లైన్: విజయనగరం రైల్వే పోలీస్‌స్టేషన్‌కు ఎస్‌ఐగా ఎవరు వచ్చినా.. ఆరు నెలలకే బదిలీ అవుతున్నారు. ఎస్‌ఐ నుంచి సీఐలుగా పదోన్నతి లభించే చివరి సమయాల్లో ఉన్నతాధికారులు వారిని ఇక్కడకు బదిలీ చేస్తున్నారు. దీంతో ఈ స్టేషన్‌కు వచ్చిన ఎస్‌ఐలు ఆరు నెలలుగా తిరగక ముందే బదిలీపై వెళ్లిపోతున్నారు. విజయన గరం నుంచి కూనేరు, కొత్తవలస నుంచి అరకు తాటిన తరువాత గోరాపూర్, రైల్వేస్టేషన్‌నుంచి గూడ్స్‌షెడ్ రైల్వే బ్రిడ్జి, విజయనగరం నుంచి కొత్తవలస వరకు సుమారు 287 కిలోమీటర్ల వరకు ఈ స్టేషన్ పరిధి విస్తరించి ఉంది.
అయితే ఎనిమిది నెలలుగా ఎస్‌ఐ పోస్టు ఖాళీగా ఉండడంతో ఉన్నతాధికారులు హెడ్‌కానిస్టేబుళ్లతోనే కాలాన్ని వెళ్లదీస్తున్నారు. ఈ స్టేషన్ పరిధిలో రోజూ ఏదో ఒకచోట ప్రమాదం జరుగుతూనే ఉంటుంది. కేసులకు సంబంధించిన దర్యాప్తు, విచారణ ఎస్‌ఐ స్థాయిలో చేయాల్సి ఉంది. రైళ్లలో దొంగతనాలను నిరోధించడానికి కూడా ఎస్‌ఐ స్థాయిలో బీట్‌లు వేయాల్సి ఉంది. అయితే ఈ స్టేషన్‌కు వచ్చిన ప్రతి ఎస్‌ఐ కూడా ఆరు నెలలకే బదిలీ అవుతున్నారు. ఎస్‌ఐ నుంచి సీఐలుగా పదోన్నతి లభించే చివరి సమయాల్లో ఉన్నతాధికారులు ఇక్కడకు బదిలీ చేస్తున్నారు. దీంతో ఈ స్టేషన్‌కు వచ్చిన ఎస్‌ఐలు ఆరు నెలలుగా తిరగక ముందే బదిలీపై వెళ్లిపోతున్నారు. గతంలో ఇక్కడ ఎస్‌ఐలుగా పని చేసిన వెంకటేశ్వరరావు, కె.వి. బా లకృష్ణ, రంగనాధం, ఎస్. గోవిందరావులకు సీఐలుగా పదోన్నతి లభించింది.
ఖాళీ మాట వాస్తవమే
విజయనగరం రైల్వే పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐ పోస్టు ఎనిమిది నెలలుగా ఖాళీగా ఉన్న మాట వాస్తవమే. ఎస్‌ఐ పోస్టు ఖాళీగా ఉందన్న విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాం. త్వరలోనే భర్తీ చేస్తారు.
డి. నవీన్‌కుమార్, సీఐ రైల్వే పోలీస్‌స్టేషన్