మేడ్చల్ రూరల్, న్యూస్‌లైన్: గ్లోబలైజేషన్‌తో సాఫ్ట్‌వేర్ రంగానికి ప్రాధాన్యత పెరిగిందని రెడ్‌హట్ సాఫ్ట్‌వేర్ సంస్థ ట్రైనింగ్ సర్వీసెస్ భారతదేశ హెడ్ సుధీర్ భాస్కరన్ పేర్కొన్నారు. శుక్రవారం మండల పరిధిలోని కండ్లకోయ సమీపంలో ఉన్న సీఎంఆర్ కళాశాల క్యాంపస్‌లో రెడ్‌హట్ అకడమీని ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. సాఫ్ట్‌వేర్ రంగంలో వస్తున్న మార్పులకనుగుణంగా విద్యార్థులు ప్రావీణ్యత సాధించాలన్నారు. సాఫ్ట్‌వేర్ రంగంలో ఉద్యోగ అవకాశాలు, వేతనాలు కూడా అధికంగా ఉంటాయన్నారు.
రాష్ట్రంలో తమ రెడ్ హట్ సంస్థ అకడమీని సీఎంఆర్ కళాశాలలో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. తమ సంస్థ ద్వారా ఆర్‌హెచ్‌సీఎస్‌ఏ, ఆర్‌హెచ్‌సీఈ, ఆర్‌హెచ్‌సీఐడీ కోర్సులను అందిస్తామన్నారు. ఈ మేరకు కళాశాల యాజమాన్యంతో ఒప్పందం కుదుర్చుకొని విద్యార్థులకు ట్రైనింగ్ మెటీరియల్‌ను అందించారు. కార్యక్రమంలో కళాశాల చైర్మన్ గోపాల్‌రెడ్డి, సెక్రెటరీ వసంత లత, డెరైక్టర్ రాజిరెడ్డి, డీన్ పూర్ణచందర్‌రావు, హెచ్‌ఓడీ సృజన్‌రాజు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
గ్లోబలైజేషన్‌తో సాఫ్ట్‌వేర్‌కు పెరిగిన ప్రాధాన్యం
Published Fri, Sep 20 2013 11:34 PM | Last Updated on Mon, Oct 22 2018 7:42 PM
Advertisement
Advertisement