నూతన కోర్టు నిర్మాణం త్వరలో ప్రారంభం | Soon begin the construction of the new court | Sakshi
Sakshi News home page

నూతన కోర్టు నిర్మాణం త్వరలో ప్రారంభం

Published Fri, Aug 16 2013 2:45 AM | Last Updated on Fri, Sep 1 2017 9:51 PM

Soon begin the construction of the new court

పరకాల, న్యూస్‌లైన్ : పరకాల జూనియర్ సివిల్ జడ్జి కోర్టు నూతన భవన నిర్మాణానికి త్వరలో శంకుస్థాపన చేయనున్నారు. పాత భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరడంతో ప్రస్తుతం తాత్కాలికంగా ప్రైవేట్ భవనంలో నిర్వహిస్తున్నారు. కొత్త భవనం నిర్మాణానికి రూ.2.70కోట్ల నిధులు మంజూరు కావడంతో టెండర్లను ఖరారు చేసి కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించారు. కోర్టు నిర్మాణానికి త్వరలో శంకుస్థాపన తేదీని ఖరారు చేయడం కోసం జిల్లా జడ్జి డి.లీలావతి, ఫస్ట్ అడిషనల్ సెషన్స్ జడ్జి(ఏడీజే) నర్సింహులు గురువారం పట్టణానికి వచ్చారు. పాత కోర్టు వద్దకు చేరుకుని అక్కడి స్థలాన్ని పరిశీలించారు. 1990లో నిర్మించిన పాత భవనం కనీసం పదేళ్లు కూడా పనికిరాకుండా పోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. భవనం పెచ్చులు ఊడిపోతుండడం, వర్షపు నీరు పైకప్పు నుంచి కిందపడుతుండడం చూసి విస్మయం చెందారు. నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఈ దుస్థితికి కారణమని అభిప్రాయపడ్డారు. ఆర్‌అండ్‌బీ అధికారులు, ఇంజినీర్ దగ్గరుండి పనులు చేయించాలని కోరారు.


 మరో అడిషనల్ కోర్టు మంజూరు..
 పరకాలకు మరో అడిషనల్ కోర్టు మంజూరైంది. ప్రస్తుతం ఉన్న కోర్టులో 4వేల వరకు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. కేసుల సత్వర పరిష్కారానికి హైకోర్టు మున్సిఫ్ కోర్టులను ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా పరకాలకు మరో కోర్టు మంజూరు కావడంలో కోర్టును ఎక్కడ ఏర్పాటు చేయాలనే విషయంపై చర్చించారు. మౌలిక వసతుల కల్పన, భవన నిర్మాణం లేదా అద్దె భవనాల ఏర్పాటు విషయాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా జడ్జి, ఏడీజే వెంట పరకాల జూనియర్ కోర్టు జడ్జి ఖలీల్, పరకాల డీఏస్పీ సంజీవరావు, సీఐ వెంకటేశ్వర్లు, ఏస్సై షాదుల్లా బాబా, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజిరెడ్డి, మెరుగు శ్రీనివాస్, గండ్ర నరేష్‌రెడ్డి, గంగరబోయిన రాజేం దర్, కూకట్లు శ్రీనివాస్, పలువురు న్యాయవాదులు ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement