బుచ్చిరెడ్డిపాళెం, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన ‘న్యూస్‌లైన్’తో మాట్లాడారు. ఆరు దశాబ్దాలుగా కలిసి ఉన్న మూడు ప్రాంతాల ప్రజలకు నీటికి కొట్టుకోవాల్సిన పరిస్థితి వస్తోందన్నారు. కృష్ణానీటి పంపకాల్లో రాష్ట్రానికి కేటాయిం పుల నిష్పత్తి ఎలా ఉన్నా, ట్రిబ్యునల్, కోర్టులు ఏం చెప్పినా మహారాష్ట్ర అవసరాలను తీర్చిన తరువాతే నీరు కర్ణాటకలోకి వ స్తోందన్నారు. అక్కడి ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలు నిండితే తప్ప రాష్ట్రానికి చుక్క నీరు కూడా రాదన్నారు. ఈ సమస్యలపై ఎన్నిసార్లు గొంతు చించుకున్నా, ఆర్తనాదాలు చేసినా పట్టించుకునే నాథుడే లేడన్నా రు. ఈ నేపథంలో విభజన జరిగితే రా ష్ట్రం పరిస్థితి ఏంటని, శ్రీశైలం ప్రాజెక్టు కు నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయని ఆ యన ప్రశ్నించారు.
జిల్లాకు జీవనాధారమైన పెన్నాన ది, ఉపనదులైన పాపాగ్ని, జైమంగళి, చెయ్యేరు, సగిలేరుపై అడ్డుకట్టలు కట్టడంతో నీటి లభ్యత తగ్గిందన్నారు. పె న్నానది నీటితో జిల్లాలోని లక్షలాది ఎకరాలకు సాగునీరు, ప్రజలకు తాగునీటి అవసరాలు తీరుతున్నాయన్నారు. ప్ర స్తుతం నీటి లభ్యత తగ్గడంతో కృష్ణాజలాలే దిక్కయ్యాయన్నారు.
ఇటువంటి పరిస్థితి వస్తుందనే ముందుచూపుతో తన తండ్రి నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి, ఎన్‌టీ రామారావును ఒప్పించి సోమశిల జలాశయాన్ని తెలుగుగంగలో అంతర్భాగం చేశారన్నారు. ఫలితంగా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి కృష్ణా జలాలు సోమశిల జ లాశయానికి వస్తున్నాయన్నారు. నిన్నమెన్నటివరకు నీటి చుక్కలేని సోమశిల లో ప్రస్తుతం 18 టీఎంసీల నీరు చేర డం పోతిరెడ్డిపాడు ఫలితమేనని చెప్పా రు. దీని ప్రాధాన్యాన్ని గ్రహించిన మ హానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ వద్ద నీటి విడుదల సామర్ధ్యాన్ని 11వేల క్యూసెక్కుల నుంచి 44 వేల క్యూసెక్కులకు పెంచారని గుర్తు చేశారు.
కర్ణాటకలోని ఆల్మట్టి డ్యాం, రాష్ట్రం లోని శ్రీశైలం ప్రాజెక్టుల నడుమ జూ రాల జలాశయం మాత్రమే ఉందని వి వరించారు. తెలంగాణ ఏర్పడితే శ్రీశై లం ప్రాజెక్టుకు కృష్ణా జలాలు రాకుం డా అడ్డుకునే కుట్ర జరుగుతోందన్నా రు. ఫలితంగా శ్రీశైలం జలాశయానికి నీటి లభ్యత తగ్గి, పోతిరెడ్డిపాడు నుం చి పెన్నానదికి నీటి సరఫరా పూర్తిగా లే కుండా పోతుందన్నారు. జిల్లాలో సా గు, తాగు నీటికి కటకటలాడాల్సి వ స్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. మా గాణి భూములన్నీ బీళ్లుగా మారడం ఖాయమన్నారు. ఈ విషయాన్ని రైతులు గమనించి విభజనకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
విభజనతో రైతులకు తీవ్ర నష్టం
Published Sun, Aug 25 2013 6:51 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement