విభజన బిల్లు ఆపకుంటే కాంగ్రెస్‌కు నూకలు చెల్లినట్లే
పుంగనూరు, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన బిల్లును పార్లమెంటులో ఆపకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించక తప్పదని మాజీ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హెచ్చరించారు. శనివారం ఆయన పుంగనూ రు మండలంలోని ఒంటిమిట్ట గ్రామం లో గడపగడపకూ వైఎస్సార్ సీపీ కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగితే సీమాంధ్ర ప్రాంతం ఎడారిగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. విభజనతో నిత్యం ఘర్షణలు చోటు చేసుకుంటాయని, అభివృద్ధి కుంటుపడుతుందని ఆవేదన చెందారు.
కిరణ్‌కుమార్‌రెడ్డి సమైక్యం పేరుతో నటిస్తూ సోనియాగాంధీకి కోవర్టుగా పని చేస్తున్నారని దుయ్యబట్టారు. విభజన బిల్లు పెడితే రాజీ నామా చేస్తానని గొప్పలు చెప్పిన కిరణ్‌కుమార్‌రెడ్డి నేడు పదవి కోసం పాకులాడుతున్నారని ఆరోపించారు. కిరణ్ కుమార్‌రెడ్డికి చంద్రబాబు ప్రత్యక్షంగా మద్దత్తు ఇస్తున్నారని ఆరోపించారు. విభజన కోసం తొలుత లేఖ ఇచ్చి ఇప్పుడు సమైక్య నాటకం మొదలు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాటకాల రాయుడులిద్దరూ తెలుగు ప్రజలను మోసగిస్తూ పబ్బం కడుపుతున్నారని, వీరికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.
రానున్న ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్‌కు డిపాజిట్లు కూడా దక్కవన్నారు. సమైక్యాంధ్ర కోసం తొలి నుంచి జగన్‌మోహన్‌రెడ్డి పోరా టం చేస్తున్నారని తెలిపారు. మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డి ఆశయాలు అమ లు కావాలంటే వైఎస్సార్ సీపీని గెలిపించాలని ఆయన పిలుపునిచ్చా రు. ఈ కార్యక్రమంలో నేతలు ద్వారకనాథరెడ్డి, పెద్దిరెడ్డి, రెడెప్ప, వెంకటరెడ్డి యాదవ్, అమరనాథరెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, మదనపల్లె బాబ్‌జాన్, అక్కిసా ని భాస్కర్‌రెడ్డి, నాగరాజరెడ్డి, సుబ్బ మ్మ, హేమావతి, షకీలా తదితరులు పాల్గొన్నారు.