బంద్ ప్రశాంతం
ఆగిన ఆర్టీసీ బస్సులు
పలుచోట్ల ర్యాలీలు.. ధర్నాలు
బాసటగా నిలిచిన వైఎస్‌ఆర్ సీపీ శ్రేణులు
చిత్తూరు (అర్బన్): సీపీఐ పిలుపు మేరకు మంగళవారం చేపట్టిన బంద్ జిల్లాలో పాక్షికంగా జరిగింది. చిత్తూరు నియోజకవర్గంలో సీపీఐ నాయకులు నాగరాజన్ ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు మద్దతునిచ్చారు. చిత్తూరు-వేలూరు రహదారిపై నేతలు కూర్చుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరితోపాటు కాంగ్రెస్‌ను సైతం దుయ్యబట్టారు. దుకాణాలను, కార్యాలయాలను, బ్యాంకులను, విద్యాసంస్థలను మూయించారు.
పలమనేరులో సీపీఐ, సీపీఎం, విద్యా ర్థి సంఘ నాయకులు కలిసి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి బంద్‌లో పాల్గొన్నారు.పుంగనూరులో సీపీఐ నాయకులు సత్తార్ ఆధ్వర్యంలో బంద్‌ను నిర్వహించారు. పట్టణంలో ప్రదర్శన నిర్వహించిన నాయకులు జాతీయ రహదారిపై కూర్చుని నిరసన వ్యక్తం చేశారు.మదనపల్లెలో జరిగిన బంద్ సంపూర్ణంగా జరిగింది. ఉదయం నుంచే వాహనాలను రోడ్లపై సీపీఐ నాయకులు అడ్డుకున్నారు. బంద్‌లో స్థాని క ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డి పాల్గొని రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని నినదించారు.
కుప్పంలో వ్యాపారులు స్వచ్ఛం దంగా దుకాణాలు మూసేసి బంద్ కు సహకరించారు. బస్సులు సైతం ఎక్కడికక్కడే ఆగిపోయాయి. పీలేరులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వైఖ రిని నిరసిస్తూ ఏఐటీయూసీ నాయకులు చిన్న ఎల్లప్ప ఆధ్వర్యంలో బం ద్‌ను నిర్వహించారు.తంబళ్లపల్లె నియోజకవర్గంలో బంద్ పాక్షికంగా జరిగింది. నియోజకవర్గ పరిధిలోని అన్ని మండల కేంద్రాల్లో సీపీఐ ఆధ్వర్యంలో బంద్ జరిగింది.