విద్యార్థుల ఆటో బోల్తా | Student auto roll | Sakshi
Sakshi News home page

విద్యార్థుల ఆటో బోల్తా

Published Fri, Jul 25 2014 3:42 AM | Last Updated on Sat, Sep 2 2017 10:49 AM

విద్యార్థుల ఆటో బోల్తా

విద్యార్థుల ఆటో బోల్తా

కలిగిరి: ఆటోల దూకుడు ప్రయాణికులకే కాదు.. పాఠశాల విద్యార్థులకూ ప్రమాదాలు తప్పడం లేదు. విద్యార్థులను జాగ్రత్తగా తీసుకు రావాల్సిన ఆటో డ్రైవర్లు ఇవేమి పట్టించుకోకుండా ఇష్టానుసారం మితిమీరిన వేగంతో నడుపుతుండటంతో విద్యార్థులు ప్రమాదాల భారిన పడుతున్నారు. మితిమీరిన వేగంతో వెళ్తున్న ఆటో తిరగబడి విద్యార్థులు గాయపడిన సంఘటన గురువారం కలిగిరిలో చోటుచేసుకుంది.
 
 కలిగిరి సమీపంలోని కమ్మవారిపాళెంలో మోడల్ స్కూల్ నుంచి విద్యార్థులను ఇళ్లకు తీసుకువెళుతున్న ఆటో బోల్తాపడింది. ఈ సంఘటనలో ఐదుగురు విద్యార్థులు గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. మోడల్ స్కూల్ నుంచి 8 మంది విద్యార్థులు ఆటోలో వస్తున్నారు. ఆటో డ్రైవర్ ఫిరోజ్ మీతిమీరిన వేగంతో నడుపుతుండటంతో కేజీబీవీ పాఠశాల వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న కలిగిరికి చెందిన 6వ తరగతి విద్యార్థి పెద్ది వంశీ, 9వ తరగతి విద్యార్థి శెట్టి రుచితకు తీవ్ర గాయాలవ్వగా, 8వ తరగతి చదువుతున్న రాజనాల ప్రత్యూష, ఆవుల మానస, ఆవుల పూర్ణిమ గాలయాలపాలయ్యారు.
 
  స్థానికులు గాయపడిన విద్యార్థులను మరో ఆటోలో కలిగిరిలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. ఆర్టీసీ బస్సులు పాఠశాల వద్ద ఆపకపోతుండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆటోలను నెల అద్దెకు మాట్లాడుకుని విద్యార్థులను పంపుతుంటారు. ప్రమాదం అని తెలిసినా తప్పనిసరి పరిస్థితుల్లో ఆటోల్లో పంపాల్సి వస్తుందని, అధికారులు స్పందించి పాఠశాల వద్ద బస్సులు నిలిపేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. విద్యార్థులు ప్రయాణిస్తున్న ఆటో ప్రమాదానికి గురైందని తెలుసుకున్న తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో ప్రజలు వైద్యశాల వద్దకు చేరుకున్నారు. మెదక్ జిల్లా మాసాయిపేటలో రైలు ఢీకొన్న సంఘటనను టీ వీల్లో చూస్తున్న ప్రజలు ఈ ప్రమాదం విషయం తెలుసుకుని ఆందోళనకు గురయ్యారు. గాయపడిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఓదార్చారు. ఆటో డ్రైవర్ నిర్లక్ష్యంతో ఈ ప్రమాదం జరిగిందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సై దాసరి రాజారావు సంఘటన స్థలానికి చేరుకొని ఆటోను స్వాధీనం చేసుకొని పోలిస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం వైద్యశాలకు వచ్చి వివరాలు నమోదు చేసుకున్నారు. ప్రమాదానికి కారణమైన ఆటో డ్రైవర్ పరారీలో ఉన్నాడు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై  తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement