చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకు తీవ్ర అన్యాయం చేస్తోందని వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మేరుగ నాగార్జున మండిపడ్డారు.
చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకు తీవ్ర అన్యాయం చేస్తోందని వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మేరుగ నాగార్జున మండిపడ్డారు. జీవో 23లోని సెక్షన్ 11డిని వెంటనే సవరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధులను పక్కదోవ పట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు.
దళితుల హక్కులను కాలరాసేలా ఈ జీవో ఉందని, ఇంత జరుగుతున్నా టీడీపీలో ఉన్న దళిత మంత్రులు మాత్రం కళ్లు లేని కబోదుల్లా వ్యవహరిస్తున్నారని మేరుగ నాగార్జున మండిపడ్డారు. ఈనెల 24వ తేదీన వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లకు మెమొరాండం ఇస్తామని ఆయన తెలిపారు.