రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదని కలత చెందిన చిత్తూరు జిల్లా పలమనేరులోని ఓ వ్యాపారి సోమవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
పెట్రోల్ పోసుకుంటుండగా వ్యాపారిని అడ్డుకున్న పోలీసులు
పలమనేరు: రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదని కలత చెందిన చిత్తూరు జిల్లా పలమనేరులోని ఓ వ్యాపారి సోమవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఒంగోలుకు చెందిన శంకర్‌రెడ్డి పలమనేరు మార్కెట్‌లో టమాటాల వ్యాపారి. ప్రత్యేక హోదా రాకపోవడానికి సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడులే ప్రధాన కారణమని, ఐదుకోట్ల మందిని వీరు మోసం చేశారనే బాధతో ఆత్మహత్య చేసుకుంటానని పలుమార్లు డీఎస్పీ శంకర్‌కు వినతిపత్రాలను అందజేశాడు. డీఎస్పీ కౌన్సెలింగ్ ఇచ్చి పంపేవాడు.
అయితే, సోమవారం ఉదయం పెట్రోలు తీసుకుని సరాసరి పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన శంకర్‌రెడ్డి ప్రత్యేక హోదా కావాలంటూ అరుస్తూ ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పు పెట్టుకునేందుకు యత్నిస్తుండగా అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకు న్నారు. అతడి ఒంటిపై నీళ్లు పోసి అదుపులోకి తీసుకున్నారు.