ఉండి, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజన ప్రకటనతో తీవ్ర ఆవేదన చెందిన యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఉండి మండలం కోలమూరులో ఈ విషాద ఘటన చోటుచేసుకొంది. కోలమూరుకు చెందిన మువ్వా మేషక్ (22) వ్యవసాయ కూలీ. అవివాహితుడైన ఇతనిపై వృద్ధులైన తల్లిదండ్రులు, మతిస్థిమితం లేని చెల్లి ఆధారపడి ఉన్నారు. ఆరు రోజులుగా సమైక్యాంధ్ర ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నాడు. సోమవారం కోలమూరులో జరిగిన ఉద్యమంలో భాగంగా వంటా వార్పు కార్యక్రమంలో పాల్గొన్నాడు. మంగళవారం ఉదయం ఇంట్లోనుంచి బయటకు వెళ్లి పొలంగట్టు వద్ద పురుగులమందు తాగి ప్రాణాలు వదిలాడు. అతని మృతితో ఆ కుటుంబం రోడ్డున పడింది.
ఇంకా ఎంతమంది బలవ్వాలి : మాజీ ఎమ్మెల్యే సర్రాజు
మేషక్ మృతి వార్త తెలిసిన వెంటనే మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు కోలమూరు వెళ్లి అతని కుటుంబ స భ్యులను ఓదార్చారు. సర్రాజు మా ట్లాడుతూ రాష్ట్ర విభజనను తట్టుకోలేక ఓ యువకుడు ఆత్మబలిదానం చేసుకోవడం బాధాకరమన్నారు. ఇంకా ఎంతమంది బలవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇప్పటికే యిర్రింకి శ్రీను, కట్టా వెంకటేశ్వరరావు బలయ్యారని చెప్పారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని సోనియా గాంధీ ఇప్పటికైనా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆ కుటుంబానికి ఆర్థికసాయం అం దించారు. గ్రామ సర్పంచ్ నేతల మార్టిన్, ఉప సర్పంచ్ కూనపరాజు సత్యనారాయణరాజు పాల్గొన్నారు.
సమైక్యాంధ్ర కోసం ఆత్మహత్య
Published Wed, Aug 7 2013 5:11 AM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM
Advertisement