నెల్లూరు (రెవెన్యూ) : కలిగిరి తహశీల్దార్ వి. లావణ్యను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఎం. జానకి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. లావణ్య కొండాపురం మండలంలో తహశీల్దార్‌గా పనిచేసిన సమయంలో వెబ్‌ల్యాండ్ విషయంలో అక్రమాలకు పాల్పడ్డారు. వెబ్‌ల్యాండ్‌లో అనర్హుల పేర్లు చేర్చారు.
గానుగపెంట పంచాయతీలో భూములను అధికార పార్టీ నాయకుల అండతో బినామీ పేర్లతో భూ రికార్డులు తారుమారు చేశారు. బినామీ పేర్లతో పాసుపుస్తకాలు సృష్టించారు. గంట శ్రీనివాసరావు భూములకు సంబంధించి అక్రమాలకు పాల్పడ్డారనే ఫిర్యాదులు వచ్చాయి. ఈ విషయాలపై జాయింట్ కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ విచారణ జరిపించి నివేదికలు కలెక్టర్‌కు అందజేశారు. భూముల విషయంలో అక్రమాలకు పాల్పడట్టు నిర్ణారణకావడంతో సస్పెండ్ చేశారు.