అనంతపురం, తాడిపత్రి: తాడిపత్రి సీఐ నారాయణరెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. తాజాగా వైఎస్సార్‌సీపీ పోలింగ్ ఏజెంట్లను పోలీసుస్టేషన్‌కు రావాలని బెదిరించిన ఆడియో టేపులు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. జేసీ వర్గానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని సీఐ నారాయణరెడ్డిపై ఆరోపణలు రావడంతో ఈసీ పోలింగ్‌కు ముందే ఎన్నికల విధుల నుండి ఆయన్ను తప్పించింది. అయినా కూడా సీఐ నారాయణరెడ్డి పోలింగ్ రోజున వైఎస్సార్‌సీపీ ఏజెంట్లపై బెదిరింపులకు దిగారు. తాడిపత్రి మండల పరిధిలోని యర్రగుంట్లలో పోలింగ్ ఏజెంట్ కిషోర్‌ను పోలీస్‌స్టేషన్‌కు రావాలంటూ ఫోనులో హెచ్చరించారు. దీనికి సంబంధించిన ఆడియో టేపులు ఆలస్యంలో వెలుగులోకి వచ్చాయి.
పోలింగ్ అనంతరం ముగ్గురు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన సిఐ నారాయణరెడ్డి... తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి అండదండలతో రెచ్చిపోతున్నారు. ఈ విషయంలో సిఐ నారాయణరెడ్డిపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ నాయకులు డిమాండ్ చేశారు. తమ కార్యకర్తలపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని అకారణంగా దాడి చేశారని సీఐ నారాయణరెడ్డిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసిన విషయం విధితమే. ఫిర్యాదు చేసి 24 గంటలు గడుస్తున్నా సీఐ నారాయణరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేయకుండా మీనమేషాలు లెక్కిస్తున్నట్లు సమాచారం. జేసీ బ్రదర్స్ సూచనల మేరకే పోలీసులు నడుచుకుంటున్నారన్న విమర్శలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment