రావివలస సహకార సంఘంలో జరిగిన అక్రమాలపై విచారణకు వచ్చిన తహసీల్దారు కె.సత్యనారాయణను బాధిత రైతులు నిర్భందించారు.
పార్వతిపురం (విజయనగరంజిల్లా) : రావివలస సహకార సంఘంలో జరిగిన అక్రమాలపై విచారణకు వచ్చిన తహసీల్దారు కె.సత్యనారాయణను బాధిత రైతులు నిర్భందించారు. రుణాలు తీసుకోకుండానే రుణాలు తీసుకున్నట్లు ఎలా నమోదు చేస్తారని, బినామీ వ్యవహారం తేల్చాలని డిమాండ్ చేశారు. డీసీబీ చైర్మన్ ఇంటి ముందు ధర్నా చేశారు.