గుంటూరు జిల్లాలో బుధవారం ఉదయం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నాదెండ్ల మండలంలో వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ కార్యకర్తలు దాడికి యత్నించడంతో ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది.
గుంటూరు: గుంటూరు జిల్లాలో బుధవారం ఉదయం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నాదెండ్ల మండలంలో వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ కార్యకర్తలు దాడికి యత్నించడంతో ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్లితే... సాతులూరు గ్రామానికి చెందిన ఓ యువకుడు పేకాట ఆడుతూ పట్టుబడడంతో పోలీసులు అతన్ని చితకబాదారు. దీంతో మనస్తాపం చెందిన అతను పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేసుకున్నాడు. దీనికి కారణమైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే డా.గోపిరెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. వారిపై టీడీపీ కార్యకర్తలు దాడికి యత్నించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు.