ప్చ్.. ఏం మంత్రులో | tdp leaders corruption | Sakshi
Sakshi News home page

ప్చ్.. ఏం మంత్రులో

Published Mon, Mar 14 2016 3:46 AM | Last Updated on Tue, May 29 2018 11:50 AM

ప్చ్.. ఏం మంత్రులో - Sakshi

ప్చ్.. ఏం మంత్రులో

‘అనంత’ అభివృద్ధిని పూర్తిగావిస్మరిస్తోన్న ప్రభుత్వం
22 నెలల్లో ఒక్క అభివృద్ధికార్యక్రమానికీ శ్రీకారం చుట్టని వైనం
ఇంత అన్యాయం జరుగుతున్నా
  సీఎం వద్ద నోరెత్తని మంత్రులు
సొంత వ్యవహారాలుచక్కబెట్టుకోవడంలో బిజీ

 
 ‘అనంత’ అభివృద్ధి కోసమంటూ అసెంబ్లీ సాక్షిగా 21 వరాలను సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఒక్కటీ ఆచరణలో పెట్టలేకపోయారు. ప్రభుత్వం ఏర్పాటై దాదాపు రెండే ళ్లు కావస్తున్నా.. ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టలేదు. జిల్లా మంత్రులు కూడా ‘రెండేళ్లలో ఒక్క పనీ చేయించుకోలేపోయాం.. ‘అనంత’ అభివృద్ధిపై ఇప్పటికైనా మీరు చొరవ చూపాల’ని  సీఎంను అడిగే స్థితిలో లేరు. కనీసం ఆత్మవిమర్శ చేసుకునే పరిస్థితిలో కూడా లేరు. వీరి తీరు చూస్తుంటే భవిష్యత్తులోనూ ‘అనంత’ అభివృద్ధి అంగుళం కూడా కదిలే
 అవకాశం లేదని స్పష్టమవుతోంది. ఆవశ్యకత ఏర్పడింది.


 చేతులెత్తేసిన మంత్రులు
జిల్లా అభివృద్ధిపై ప్రభుత్వం ఏమాత్రం శ్రద్ధ చూపుతోందన్న విషయాన్ని నిశితంగా పరిశీలిస్తూ, ఎప్పటికప్పుడు అప్రమత్తమై జిల్లాను అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మంత్రులపై ఉంటుంది. ఆ తర్వాత బాధ్యత ఎమ్మెల్యేలది. రాయలసీమలో టీడీపీ అధిక స్థానాలు గెలిచిన జిల్లాల్లో ‘అనంత’ది మొదటిస్థానం. ఇద్దరు ఎంపీలతో పాటు 12మంది ఎమ్మెల్యేలను జిల్లా వాసులు ఆ పార్టీ తరఫున గెలిపించారు. పల్లెరఘునాథరెడ్డి, పరిటాల సునీత మంత్రులుగా కొనసాగుతున్నారు. కాలవ శ్రీనివాసులు ప్రభుత్వ చీఫ్‌విప్‌గా ఉన్నారు. ఈ ముగ్గురూ మైకుల ముందు బీరాలు పలకడం మినహా జిల్లా అభివృద్ధి కోసం ఒక్క ప్రతిపాదన కూడా ప్రభుత్వం ముందు ఉంచలేకపోతున్నారు.

పల్లె  పరిస్థితి చూస్తే  మంత్రి అని చెప్పుకోవడం మినహా ప్రభుత్వంలో  ఏమాత్రమూ పలుకుబడి లేదని ప్రజలు సర్వత్రా చర్చించుకుంటున్నారు. ఈయన సిఫారసులను తోటి మంత్రులు కూడా  పరిగణనలోకి తీసుకోరని తెలుస్తోంది. తన సత్తా గ్రహించిన పల్లె సొంత వ్యవహారాలు చక్కబెట్టుకోవడంపైనే దృష్టి పెట్టారని, మరొక ఆలోచన చేయడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు.   మరో మంత్రి పరిటాల సునీత జిల్లా అభివృద్ధిని పూర్తిగా గాలికొదిలేశారు. తన కుమారుణ్ని రాబోయే ఎన్నికల్లో ఏదో ఒకస్థానం నుంచి అసెంబ్లీ బరిలోకి దించాలనే శ్రద్ధలో ఒక శాతం కూడా జిల్లా అభివృద్ధిపై లేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇక కాలవ శ్రీనివాసులు‘దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే రీతిలో ఆర్థికంగా ఎదగడంపైనే ఫోకస్ పెట్టారని తెలుస్తోంది. ఈ ముగ్గురి వైఖరి జిల్లాకు శాపంగా మారింది. కనీసం కీలక అంశాలపై కూడా దృష్టి సారించడం లేదు. 2013కు సంబంధించి రూ.643 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీని చంద్రబాబు ఎగ్గొట్టినా, 2014కు సంబంధించి హక్కుగా రావాల్సిన రూ.వంద కోట్లు ఎగవేస్తున్నా ఇదేంటని ప్రశ్నించలేకపోతున్నారు.

హంద్రీ-నీవా డిస్ట్రిబ్యూటరీ పనులు చేయొద్దని జీవో జారీ చేసినా.. ‘మూడేళ్ల నుంచి నీళ్లు వృథాగా పోతున్నాయి, మా జిల్లాలో డిస్ట్రిబ్యూటరీలు పూర్తి చేయండ’ని గట్టిగా అడగలేకపోతున్నారు.  ప్రభుత్వ మోసపూరిత వైఖరితో జిల్లాలో 153మంది ైరె తులు ఆత్మహత్యలకు తెగించగా...వారి కుటుంబాలకు పూర్తిస్థాయిలో పరిహారం ఇప్పించలేకపోతున్నారు. 21 వ రాలు ప్రకటించారు.. కనీసం ఒక్కటీ చేయలేకపోతున్నారని అడగలేకపోతున్నారు. 12మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీల బలమున్నా పెదవి విప్పలేకపోతున్నారు. గతంలో జిల్లా నుంచి చాలామంది మంత్రులు ప్రాతినిథ్యం వహించినా, ఇంతటి నిస్సహాయస్థితిలో ఎవ్వరూ లేరని రాజకీయ పార్టీలు విమర్శిస్తున్నాయి. ఇప్పటికైనా వీరు అభివృద్ధివైపు చూస్తారో..నిస్సహాయులుగానే కాలం వెల్లదీస్తారో వేచిచూడాలి.
  
 ‘కంచుకోట’పై కనికరం ఏదీ?
 చంద్రబాబు  2014 జూన్‌లో సీఎం పీఠమెక్కారు.  జిల్లాకు వచ్చిన ప్రతిసారి ‘అనంత’పై తనకు అమితమైన ప్రేమ ఉందని, కలలో కూడా ఈ జిల్లా గుర్తొస్తుంటుందని చె ప్పుకొచ్చారు. ఆయన మాటల్లోని ప్రేమ..చేతల్లో లేదని గడిచిన 22 నెలల కాలం చెబుతోంది. ఏడాదిలో హంద్రీ-నీవా ద్వారా ఆయకట్టుకు నీళ్లిస్తామని చెప్పారు. నిధుల కేటాయింపు, పనుల పురోగతి చూస్తుంటే మరో మూడేళ్లయినా ప్రాజెక్టు పూర్తయ్యే పరిస్థితులు క న్పించడం లేదు. ‘అనంత’ స్మార్ట్‌సిటీ, జిల్లాలో సెంట్రల్ యూనివర్సిటీ, ఎయిమ్స్ అనుబంధ కేంద్రం, టైక్స్‌టైల్‌పార్క్,  ఎలక్ట్రానిక్స్, హార్డ్‌వేర్ క్లస్టర్ హామీలు కూడా అలాగే ఉండిపోయాయి. ఇప్పటి వరకూ భూసేకరణకు కూడా ఉపక్రమించలేదు. పుట్టపర్తిలో ప్రభుత్వం ఆధ్వర్యంలో విమానాశ్రయంతో పాటు విమానాల నిర్వహణ, మరమ్మతుల కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. ఇదీ లేదు. ఒక్కమాటలో చెప్పాలంటే 22 నెలల్లో ‘చేశాం’ అని చెప్పుకునేందుకు ఒక్కపనీ లేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement