ప్రతిపక్షంపై మరో సర్కారు మార్కు దాడి! | tdp tries to defame ysrcp mla's gestures in assembly | Sakshi
Sakshi News home page

ప్రతిపక్షంపై మరో సర్కారు మార్కు దాడి!

Published Wed, Mar 18 2015 6:39 PM | Last Updated on Sat, Aug 18 2018 8:54 PM

tdp tries to defame ysrcp mla's gestures in assembly

ఏపీ అసెంబ్లీలో అధికారపక్ష నాయకుడు బోండా ఉమా మహేశ్వరరావు వ్యాఖ్యలతో ప్రభుత్వం తీవ్ర ఇరకాటంలో పడిపోయింది. దాంతో.. తమ పరువు కాపాడుకునే ప్రయత్నాలతో నష్ట నివారణ చర్యలకు టీడీపీ ప్రభుత్వం దిగింది. బోండా ఉమా తీవ్ర అభ్యంతర వ్యాఖ్యల తర్వాత అసెంబ్లీలో దృశ్యాలను మీడియాకు విడుదల చేసింది. అయితే ఎంపిక చేసుకున్న విజువల్స్ను మాత్రమే మీడియాకు టీడీపీ అందించింది. అసెంబ్లీ ప్రసారాల విషంలో వైఎస్సార్సీపీ సభ్యులు మొదటినుంచి అభ్యంతరాలు తెలుపుతున్నారు. తమ వెర్షన్ పోనీయకుండా ఏబీఎన్ ఛానల్ అడ్డుకుందని ఆరోపించారు. మధ్యాహ్నం మీడియా పాయింట్ వద్ద ఇదే అంశాన్ని పలుమార్లు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు వివరించారు.

అయినా.. అసలు అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారాల్లో ఎక్కడా రాకుండా.. కేవలం ఒక ఛానల్ వద్ద మాత్రమే ఉన్న దృశ్యాలను టీడీపీ విడుదల చేసింది. అందులో టీడీపీ సభ్యులు ఒక్కరు కూడా కనిపించలేదు. కేవలం వైఎస్సార్సీపీ సభ్యులు ఆవేశంగా మాట్లాడుతున్న దృశ్యాలను మాత్రమే ప్రత్యేకంగా ఎడిట్ చేసుకుని మరీ చూపిస్తూ.. పలు ఛానళ్లలో వాటిని ప్రసారం చేయించుకుని.. తమ సభ్యులను వైఎస్సార్సీపీ సభ్యులు దూషించారని, అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపణలు గుప్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement