అధికారం తమ చేతిలో ఉందన్న ధైర్యంతో.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై టీడీపీ శ్రేణులు దాడులకు తెగబడుతున్నాయి. తాజాగా గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలం నాగిరెడ్డి పాలెంలో కూడా టీడీపీ కార్యకర్తలు ఇలాగే రెచ్చిపోయి దాడి చేయడంతో శేషిరెడ్డి అనే వైఎస్ఆర్సీపీ కార్యకర్త తీవ్రంగా గాయపడ్డారు. దాంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
వైఎస్ఆర్సీపీ నేత బ్రహ్మనాయుడు వెళ్లి శేషిరెడ్డిని పరామర్శించారు. మండల పరిషత్ అధ్యక్ష ఎన్నిక నేపథ్యంలో టీడీపీ నేతలు ఎంపీడీవో కార్యాలయంలోకి చొరబడ్డారు. అక్కడ నామినేషన్ పత్రాలను లాక్కునేందుకు వారు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులపై కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడి చేయడంతో ఎస్ఐకి గాయాలయ్యాయి.
వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై తెలుగుతమ్ముళ్ల దాడి
Published Fri, Jul 4 2014 1:09 PM | Last Updated on Fri, Aug 10 2018 8:08 PM
Advertisement
Advertisement