
సాక్షి, చిత్తూరు: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సోమవారం జిల్లాకు రానున్నారు. ఉదయం 8.30 గంటలకు ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి వస్తారు. రాష్ట్ర డిప్యూటీ సీఎం నారాయణస్వామి, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు స్వాగతం పలుకుతారు. అనంతరం కేసీఆర్ రోడ్డు మార్గాన కంచికి వెళతారు. మార్గంమధ్యలో నగరి ఎమ్మెల్యే రోజా నివాసంలో తేనీటి విందులో పాల్గొంటారు. అక్కడి నుంచి కంచి కామాక్షి దేవాలయంలో జరిగే ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొంటారు. తిరుగు ప్రయాణంలో నగరి ఎమ్మెల్యే రోజా నివాసంలో భోజనం చేస్తారు. అక్కడి నుంచి రేణిగుంటకు చేరుకుని హైదరాబాద్‌కు ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళతారు.
Comments
Please login to add a commentAdd a comment