'కాంగ్రెస్ కు తెలంగాణ ప్రజలు అండగా నిలవాలి' | Telangana People should Stand for Congress: Jana Reddy | Sakshi
Sakshi News home page

'కాంగ్రెస్ కు తెలంగాణ ప్రజలు అండగా నిలవాలి'

Published Thu, Dec 5 2013 9:06 PM | Last Updated on Sat, Aug 18 2018 4:13 PM

'కాంగ్రెస్ కు తెలంగాణ ప్రజలు అండగా నిలవాలి' - Sakshi

'కాంగ్రెస్ కు తెలంగాణ ప్రజలు అండగా నిలవాలి'

హైదరాబాద్: పది జిల్లాలతో కూడిన తెలంగాణ బిల్లుకు కేంద్ర కేబినెట్ కు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరించినందుకు సోనియా, ప్రధానికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. కేంద్ర కేబినెట్ భేటీ ముగియగానే జానా రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ నేతలు మీడియాతో మాట్లాడారు. విశ్వసనీయతకు కాంగ్రెస్ మారు పేరు అని జానారెడ్డి అన్నారు.

కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు పెట్టని కోటగా నిలవాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ విశ్వసనీయతను దెబ్బతీసేందుకు కొందరు ప్రయత్నించారని జానారెడ్డి గుర్తు చేశారు. తెలంగాణ కావాలంటూనే కాంగ్రెస్ ను విమర్శించి రాజకీయ లబ్దికి యత్నించారన్నారు. జేఏసీ మిత్రులు కూడా తమను అనుమానించారన్నారు. కాంగ్రెస్ నేతలు ఎన్నో ఒత్తిడులు ఎదుర్కొన్నారని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement