పదేళ్లలో తుపాన్లు.. నష్టాలు | Ten years in the risks of cyclones .. | Sakshi
Sakshi News home page

పదేళ్లలో తుపాన్లు.. నష్టాలు

Published Sat, Oct 11 2014 3:10 AM | Last Updated on Sat, Sep 2 2017 2:38 PM

Ten years in the risks of cyclones ..

శ్రీకాకుళం పాతబస్టాండ్: గత పదేళ్లలో ఏడు తుపాన్లు జిల్లాపై దాడి చేశాయి. వీటిలో నాలుగు అక్టోబర్ నెలలోనే సంభవించి తీవ్ర నష్టం కలిగించాయి. ముఖ్యంగా గత ఏడాది అక్టోబర్‌లో విరుచుకుపడిన పై-లీన్ తుపాను సుమారు రూ.వెయ్యి కోట్ల నష్టాల్లో ముంచెత్తింది. సరిగ్గా ఏడాది తర్వాత ఇప్పుడు అంతే తీవ్రస్థాయిలో హుదూద్ తుపాను హడలుగొడుతోంది. 2003 నుంచి సంభవించిన తుపాన్లు, వాటిల్లిన
నష్టాన్ని పరిశీలిస్తే...
* 2003 అక్టోబర్ 6,7 తేదీల్లో తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాల వల్ల 51 వేల హెక్టార్లలో పంట నష్టం వాటిల్లింది. సుమారు 25వేల మంది ప్రజలు నిర్వాసితులయ్యారు.
* 2004 అక్టోబరు 3, 4, 5 తేదీల్లో కురిసిన తుపాను వర్షాలకు 2,900 హెక్టార్లలో పంటలు పోయాయి. సుమారు 20 వేల మందిప్రజలు  అవస్థలపాలయ్యారు.
* 2005 సెప్టెంబరు 18,19 తేదీల్లో కురిసిన భారీ వర్షాలకు నాగావళి, వంశధార నదులకు వరదలు వచ్చాయి. ఈ నదుల పరివాహక ప్రాంతాల్లో 15వేల హెక్టార్లలో పంటలు నాశనమయ్యాయి. సుమారు 40 వేల మంది ప్రజలు నష్టపోయారు.
* 2010 డిసెంబర్ 5-8 తేదీల మధ్య దాడి చేసిన జల్ తుఫాన్ అపార నష్టం మిగిల్చింది. సుమారు 3 లక్షల మంది ప్రజలపై ప్రభావం చూపింది. 1.60 లక్షల ఎకరాల్లో పంటలు ధ్వంసమయ్యాయి. పూరిళ్లు, కొన్ని చోట్ల పక్కా ఇళ్లు దెబ్బతిన్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులు వందల కోట్ల నష్టం వాటిల్లింది.
* 2011 అక్టోబరులో సంభవించిన నీలం తుఫాన్ జిల్లాను అతలాకుతలం చేసింది. రెండేళ్ల క్రితం నాటి జల్ తుఫాన్‌తో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న జిల్లా రైతాంగాన్ని ఇది మరింత కుంగదీసింది.
* 2012 సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 6వ తేదీ వరకు లైలా తుఫాన్ దాడి చేసింది. దీని ఫలితంగా 3 లక్షల మంది  ప్రభావితం కాగా 28వేల హెక్టార్లలో పంట నష్టం జరిగింది. నలుగురు చనిపోగా, 24 పశువులు కూడా మృతి చెందాయి. వందల సంఖ్యలో పూరిళ్లు కూలిపోయాయి. సమాచార వ్యవస్థ, విద్యుత్, రోడ్లులకు భారీ ఎత్తున వందల కోట్లలో నష్టం సంభవించింది.
* 2013 అక్టోబర్ 12న సంభవించిన పెను తుపాను పై-లీన్, అనంతరం కురిసిన భారీ వర్షాలకు ఉద్యాన, ఆహార పంటలు ఊడ్చుకుపోయాయి. సుమారు వెయ్యి కోట్ల మేరకు నష్టం వాటిల్లిందని అంచనా వేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement